ప్రణబ్ ముఖర్జీ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Celebrities tweet on Pranab Mukherjee Demise: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతివార్త విన్న ప్రతి ఒక్కరూ.. సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

‘‘5 దశాబ్దాలకు పైగా తన విశిష్టమైన రాజకీయ ప్రయాణంలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ భారతదేశ 13 వ అధ్యక్షుడయ్యే ముందు విదేశీ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రి. అతను వేరే యుగానికి చెందిన రాజకీయ నాయకుడు. రాజకీయాల లో ఆయన లేని లోటు సుస్పష్టం’’ అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

‘‘ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’’ చిరంజీవి, మోహన్ బాబు, బోనీ కపూర్ ట్వీట్ చేశారు.

‘‘మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఆకస్మిక మరణం విచారకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు.

‘‘మన మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ‌గారి మరణ వార్త విని చాలా బాధేసింది. దేశం గర్వించదగ్గ మేధావి, గొప్ప నాయకుడికి ఈ నాడు దేశం నివాళులర్పిస్తోంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను..’’ అని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related Posts