Home » డిసెంబర్ 1 నుంచి రాత్రివేళల్లో లాక్డౌన్ : కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ఇవే..
Published
2 months agoon
By
sreehariNight Time Lock Downs in Containment Zones : కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో రాత్రివేళ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచనలు చేసింది.
డిసెంబర్ 1 నుంచి 31 వరకు నూతన మార్గదర్శకాలు అమలు కానున్నాయి. స్థానికంగా ఆంక్షలు విధించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది.
లాక్ డౌన్ విధించేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్ కాని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. కంటైన్ మెంట్ కాని జోన్లలో కేంద్రం అనుమతి లేకుండా లాక్ డౌన్ విధించరాదని మార్గదర్శకాల్లో పేర్కొంది. పనివేళల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది.
ముంచుకొస్తున్న గండం.. అతి తీవ్ర తుఫాన్‌గా నివార్.. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత
దేశ రాజధాని సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తూనే ఉంది. కరోనాను నియంత్రణలో ఇప్పటికే కొన్ని ఆంక్షలను కేంద్రం సడలించింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
వేల సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి అవసరమైతే మళ్లీ లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కరోనా కట్టడిపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
మరోవైపు.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్టు వెల్లడించింది.
రాత్రి 9:30 గంటల వరకే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి ఉంటుందని పేర్కొంది. ఆంక్షలు ఉల్లంఘించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్టు తెలిపింది. డిసెంబర్ 15న ఆంక్షలపై పున: సమీక్షిస్తామన్న సీఎం అమరీందర్ తెలిపారు.