చరిత్రను కదిపి అప్పటి సంబంధాలను మళ్లీ కలుపుకోవాలని కేంద్రం ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Historical Relations: శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు మధ్య సంబంధముందట. దంతపురంలో బౌద్ధస్తూపాన్ని కళింగ రాజుల హయాంలో నిర్మించారు. అప్పుడు ప్రతిష్టించిన స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతాన్ని ఉంచారు. అది ప్రస్తుతం శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం దవల మళిగవికి చేరింది. అలా చేరడానికి గల పరిస్థితులేంటి?

భూపాలపల్లి జిల్లా దేవునిగుట్టపై ఉన్న బౌద్ధమందిరం అచ్చుగుద్దినట్టు వరల్డ్ ఫేమస్ అంకోర్‌వాట్‌ దేవాలయ నిర్మాణ స్టైల్‌లోనే ఉంటుంది. కంబోడియా నిర్మాణ విధానం భూపాలపల్లిలోని గుట్టకు లింక్ ఎక్కడ కుదరింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ చరిత్రలో సమాధానాలున్నాయి. ఇప్పుడు వాటిని వెలికి తీసే ఆయా దేశాలతో రిలేషన్లు మళ్లీ మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం.ఈ క్రమంలోనే సముద్ర మార్గం ఆధారంగా ఇండియా ఏయే దేశాలతో సంబంధాలు జరిపిందో ఆధారాలను వెలికితీయాలని నిర్ణయించింది. తీరప్రాంతం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్‌ మౌసమ్‌’ పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ఏరియాల వారీగా డివైడ్ చేసి ఎక్స్‌పర్ట్‌లకు అప్పగించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతను హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ కేపి రావుకు అప్పగించారు.

వాటర్ ట్యాంకర్‌తో వరద నుంచి టోక్యో సేఫ్.. భూగర్భంలో భారీ ఐడియా!!


కాకతీయ రాజులు ఆంధ్రప్రదేశ్‌ మెయిన్ షిప్‌యార్డ్ అయిన మచిలీపట్నం రేవు నుంచి ఇతర దేశాలతో కమర్షియల్ రిలేషన్స్ కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ రేవు మీదుగా వస్తువుల ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. వీటిని కన్ఫామ్ చేసే ఆధారాలు కనిపించాయి. కాకతీయ శాసనాలు ఇప్పటికీ ఆంధ్ర సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తుంటాయి.
ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో దేశాలతో కాకతీయుల కంటే ముందు, కాకతీయుల తర్వాత కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో అలనాటి చారిత్రక నిర్మాణాల్లో విదేశీశైలి కనిపిస్తుంటుంది. అప్పట్లోనే తెలంగాణ నుంచి నల్లరాయి ఆఫ్రికా, యూరప్‌లకు చేరింది.

ఇక్కడి నుంచి ఇంజినీర్లు ఆయా దేశాలకు వెళ్లి నిర్మాణాల్లో పాలుపంచుకున్న దాఖలాలున్నాయి. ఈ దోస్తీకి గుర్తుగా ఇప్పటికీ ఎన్నో చారిత్రక నిర్మాణాలు అలరారుతున్నాయి. ఆయా నిర్మాణాల ఆధారంగా నాటి మైత్రీజాడలను వెలికితీయాలని కేంద్రం నిర్ణయించింది.
మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ‘ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్‌’నోడల్‌ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ఓ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

Related Tags :

Related Posts :