Central Budget 2020-21 Central Minister Nirmala sitharaman

బడ్జెట్ 2020 – 2021..ఊరించి ఉసురు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ప్రవేశపెట్టగా..తన సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డుని తానే అధిగమించారు..అనారోగ్యం కారణంగా మరో రెండు పేజీల ప్రసంగం పూర్తి కాకుండానే ముగించేశారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 160 నిమిషాలకుపైగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు బడ్జెట్‌ ప్రసంగం కావడం విశేషం. 2017-18 తొలి బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగానైతే ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. దీంతో తన రికార్డును తానే స్వయంగా అధిగమించారు.

బడ్జెట్ విషయానికి వస్తే.. ఆశల భారతం కలలు నెరవేర్చడం..ఆర్ధిక రంగాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేయడం, డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే సూత్రాల ఆధారంగా 2020-21 బడ్జెట్ తయారు చేసినట్లు చెప్పారామె.. ముందుగా ఏదో భారీగా ప్యాకేజీలు ప్రకటిస్తారంటూ ఊహించిన వారికి మాత్రం బడ్జెట్ తీవ్రనిరాశే కలిగించింది. ఏడాదికాలంగా పతనమవుతోన్న ఆటో ఇండస్ట్రీ ఈ వరుసలో ముందుంది.

అలానే రైతులకు ఫెర్టిలైజర్ల సబ్సిడీ సంగతి పట్టించుకోలేదు. వ్యవసాయం, నీటిపారుదల రంగానికి రూ 2.83 లక్షల కోట్లను కేటాయించారు. ఆర్గానిక్ ఫామింగ్‌తో రసాయన ఎరువులను తగ్గిస్తామన్న ఆర్ధికమంత్రి.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతాంగాన్ని ఆహ్వానించడం కొత్త విషయంగా చూడాలి. స్థూలంగా చూస్తే..బడ్జెట్‌ని చితికిపోయిన ఆర్ధికరంగం..పడిపోయిన జిడిపి బాగానే ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత అంటూనే ఆరోగ్య రంగానికి 69వేల కోట్లు మాత్రమే కేటాయించారు..

ఇది గత బడ్జెట్‌కంటే 5 కోట్లు మాత్రమే ఎక్కువ..ఆయుష్మాన్‌భారత్‌కి కొత్త హాస్పిటల్స్ చేరుస్తామంటూ కేవలం ఐదు కోట్లు మాత్రమే ఎలా సరిపోతాయో ఆర్ధికశాఖే వివరించాలి అంటున్నారు విశ్లేషకులు. అలానే ప్రతిష్టాత్మకంగా చెప్పే నేషనల్ ఇన్‌ఫ్రా పైప్ లైన్ లక్ష్యమే ప్రకటించారు కానీ..ఎక్కడా దానికి కేటాయింపుల గురించి మాట్లాడింది లేదు..అంటే ఇది వివిధ రంగాలలో కేటాయించిన నిధులను లెక్కపెట్టుకోవాలో..లేక  రానున్న రోజుల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో పూర్తి చేసే ప్రాజెక్టులో తెలియాల్సి ఉంది.

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలకమైన రవాణారంగానికి లక్షా 74వేల కోట్ల రూపాయలు కేటాయించారు..వీటితోనే రైల్, రోడ్, విమానయాన రంగాలను వృద్ధి చేస్తామన్నారు. మొత్తం మీద ఊరించి ఉసూరనిపించడమే తప్ప..కొత్త బడ్జెట్‌పైన అద్భుతమైన బడ్జెట్ అని ప్రశంసలు మాత్రం దక్కడం లేదు.

Read More : ప్రధానమంత్రి మోడీ సెక్యురిటీ కోసం రూ. 600కోట్లు

Related Posts