లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఈసారైనా ఫలించేనా? : రైతుసంఘాలతో కేంద్రం పదో విడత చర్చలు

Published

on

Central Government Negotiations : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలతో.. కేంద్రం పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. కేసులు, దర్యాప్తు సంస్థలతో రైతు మద్దతుదారులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు రైతులు.

మరోవైపు రైతు సమస్య పరిష్కారానికి సహేతుక నిర్ణయం తీసుకుంటామంది కేంద్రం. కానీ అంశాల వారీగా చర్చకు సమ్మతించమని… చట్టాల రద్దుకే రైతులు పట్టుబడుతున్నారు. చట్టాల రద్దు మినహా ఏ డిమాండ్‌నైనా పరిశీలిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. చట్టాల్లో అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కమిటీ ముందుకు వెళ్లి సమస్యలను వివరించాలని రైతులను కోరనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే చట్టాల్లో సవరణలకు రైతుసంఘాల నేతలు ఒప్పుకోమంటున్నారు. చట్టాల రద్దుకే రైతులు పట్టుబడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం 56వ రోజుకు చేరుకున్నది.

గణతంత్ర దినోత్సవం నాడు భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన వెంటనే ఢిల్లీ ఔటర్ రింగ్‌ రోడ్‌పై లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఢిల్లీలో పోలీసులు రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌కు అనుమతివ్వరాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌కు పర్మిషన్‌ ఇవ్వవద్దని పిల్‌లో కోరారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం…. అనుమతి ఇవ్వాలా.. వద్దా అన్నది పోలీసులే నిర్ణయించాలని ఆదేశించింది.