లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

లాక్ డౌన్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్

Published

on

Central government serious on lockdown violation

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చి తిరగటం మొదలెట్టారు.  దీంతో  కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయటానికి ఉపక్రమించింది.

ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి వస్తే 6 నెలలు జైలుశిక్ష , వెయ్యిరూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇకపై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంటువ్యాధి నిరోధక చట్టం అమలుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది.

ప్రజలు తమంతటతాము సురక్షితంగా ఉండటానికి, వ్యాధివ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు  ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ అమలవుతుండగా, మరో 11 రాష్ట్రాల్లో పాక్షికంగా అమలవుతోంది. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించటంతో ప్రధాని  ఉన్నత స్ధాయి అధికారులు,మంత్రులతో సమావేశమై సోమవారం సాయంత్రం మరికొన్ని నిబంధనలు ప్రకటించే అవకాశం ఉంది. 

See Also | పెంపుడు జంతువుల వల్ల వైరస్ వస్తుందా?

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *