ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన కేంద్రం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిపారు.ఈడీ డైరక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో 2018 నవంబర్-19న ఈడీ డైరక్టర్ గా నియమితులైన సంజయ్ కమార్ పదవీకాలం వచ్చే వారంలో ముగియనుంది. అయితే,ఇప్పుడు ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.

Related Tags :

Related Posts :