లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కొలిక్కిరాని చర్చలు..5న మరోసారి రైతులతో కేంద్రం మీటింగ్

Published

on

Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్ర సింగ్ తోమర్ రైతు నాయకులతో చర్చలు జరిపారు. రైతులతో చర్చలు ఓ కొలిక్కిరాని నేపథ్యంలో ఈ నెల 5న మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమావేశం అనంతరం తెలిపారు.కాగా, ఇవాళ జరిగిన మీటింగ్ లో వ్యవసాయ చట్టాలపై అభ్యంతరాలు, డిమాండ్లను కేంద్రానికి తెలియజేశారు రైతు సంఘాల నేతలు. అయితే, నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. వ్యవసాయ చట్టం లక్ష్యాలను,ప్రయోజనాలను రైతులకు వ్యవసాయ శాఖ కార్యదర్శి వివరించారు. పంటకు మద్దతు ధర కొనసాగుతుందని ఈ సందర్భంగా రైతులకు కేంద్రం హామీ ఇచ్చింది. కనీసమద్దతు ధరపై రాతపూర్వక హామీ కూడా ఇస్తామని కేంద్రం తెలిపింది.అయితే, ఏది ఏమైనప్పటికీ కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు సమావేశంలో పట్టుబట్టారు. కాగా,వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు కేంద్రం ఒప్పుకోలేదు. లోపాలు ఉంటే సరిచేస్తామని కేంద్రం సృష్టం చేసింది. దీంతో ఈ నెల 5న మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమావేశం అనంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఈగో(అహంకారం) లేదని తోమర్ తెలిపారు.విశాల దృక్ఫధంతోనే రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తోమర్ తెలిపారు. ఎమ్ఎస్ పీ సిస్టమ్ గురించి రైతులు ఆందోళన వ్యక్తం చేశారని,అయితే ఎమ్ఎస్ సీ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుందని తాము రైతులకు హామీ ఇస్తున్నామని తెలిపారు.మరోవైపు, ఘజియాపూర్ బోర్డర్ వద్ద నేషనల్ హైవే-24(ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ బోర్డర్)పై రైతుల ఆందోళనలు తీవ్రతరం చేశారు.ఆందోళనకారులందరూ ఒక్కటై పోలీస్ బారికేడ్లను ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్-24 వన్ క్యారేజ్ వేని తాత్కాలికంగా మూసివేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *