సింగర్ సునీత పేరుతో కోటి 70లక్షలు వసూలు చేసిన దొంగ మేనల్లుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పాల్పడిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన ఘరానా మోసం అందరిని షాక్ కి గురి చేసింది. సింగర్ సునీత పేరుతో చైతన్య ఓ మహిళ నుంచి ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేయడం విస్మయం కలిగించింది. బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.

హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఓ మహిళ నుంచి చైతన్య ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేసినట్టు తేలింది. సునీత మేనల్లుడిని అంటూ పరిచయం చేసుకుని ఆఫర్లు ఇస్తానంటూ నమ్మబలికి బాధితురాలి నుంచి డబ్బు వసూలు చేశాడు చైతన్య. కేరళలో ఓ ట్రస్ట్ సభ్యత్వం కోసం రూ.50వేలు బదిలీ చేయించుకున్న చైతన్య పలు దఫాల్లో మొత్తం కోటి 70లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే చైతన్యను అరెస్ట్ చేసిన పోలీసులు అతడితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

Related Posts