లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

చలో గుంటూరు జైలు కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత

Published

on

Chalo Guntur Dist Jail : రాజధాని ఎస్సీ, ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి సంకెళ్లు వేసి తరలించినందుకు నిరసనగా..చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. 2020, అక్టోబర్ 31వ తేదీ శనివారం ఉదయం గుంటూరు జైలు వద్దకు భారీగా మహిళలు చేరుకున్నారు.వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు మహిళలు కింద పడిపోయారు. వీరందరినీ వ్యాన్ లలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ప్రియుడి మోజులో కిరాతకం…..మేకులు కొట్టిన కర్రతో కన్నబిడ్డలను చావబాదిన తల్లి


జైలో భరో కార్యక్రమానికి బయలుదేరిన తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఐకాస నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయవాడలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని తదితరులను జైల్ భరోకు వెళ్లకుండా అడ్డుకున్నారు.జైలు వద్ద ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా..ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా..ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతి లేదని అందుకే తాము అరెస్టులు చేయడం జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *