లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

చెత్త నుంచి బైక్ తయారుచేసిన పదో తరగతి స్టూడెంట్

Published

on

Scrap Material: చెత్తగా పారేసిన సామానుతో చత్తీస్‌ఘడ్‌కు చెందిన విద్యార్థి మోటార్ సైకిల్ తయారుచేశాడు. దీని కోసం చాలా వాహనాల భాగాలను సేకరించాడు. చెత్తే కదా అని తీసేయొద్దు దాంతో సాధించగలిగినవి ఇంకా మిగిలే ఉంటాయని నిరూపించాడు.

ఈ కొత్త బైక్‌తో లీటర్ పెట్రోల్ పోసి 80కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. చెత్త నుంచి వస్తువులు తయారుచేయడం ఇతనికి తొలిసారేం కాదు. మూడేళ్ల క్రితం చెత్త నుంచి వస్తువులు తీసుకుని ఎలక్ట్రిక్ బైక్ రెడీ చేశాడు.కాకపోతే అందులో సమస్య స్పీడ్ గా వెళ్లకపోవడమే. దాన్ని పెట్రోల్ బైక్ గా మార్చిన తర్వాత స్పీడ్ గా వెళ్లింది. ఇక ఇప్పుడు తయారుచేసిన బైక్ మొదటి చక్రాన్ని బైసైకిల్ నుంచి తీసుకుని మిగతావి బైక్ పార్ట్స్ కలిపాడు.

చెత్త యార్డ్‌లో రూ.3కోట్ల విలువైన బంగారం పారేసుకున్న మహిళ


చాసిస్, ఇంజిన్, చక్రం, ట్రాన్స్‌మిషన్ మొత్తం బైక్‌వే. అవేకాకుండా దీనికి రేర్ వ్యూ మిర్రర్స్, లైట్స్ కూడా అమర్చాడు. ఈ ఫొటోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతని కష్టానికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
సేఫ్టీ అంశాలు పరిగణనలోకి తీసుకుంటూనే చెత్త నుంచి కూడా విలువైనవి, ఉపయోగపడేవి తయారుచేయాలనేది అతని ఉద్దేశ్యమట.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *