జబ్బుపడ్డ చెట్ల కోసం అంబులెన్స్‌ లు..కాల్ చేస్తే వచ్చేస్తాయి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మనుషులు బతకాలంటే పచ్చని చెట్లు ఉండాల్సిందే. ప్రకృతితో మనిషి ఉండే అవినావభావ సంబంధం అంతా ఇంతాకాదు. అటువంటి ప్రకృతిలో భాగమైన పచ్చని చెట్లకు జబ్బు చేస్తే..! వాటికి కూడా వైద్యం చేయాలి. చక్కగా మళ్లీ ఏపుగా పెరిగేలా చేయాలి. అలా జబ్బు చేసిన చెట్ల కోసం అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని చక్కటి ఆలోచన చేసింది చండీగఢ్ ప్రభుత్వం.

మనుషుల కోసం అంబులెన్స్ లు ఉండటం తెలుసు గానీ చెట్ల కోసం అంబులెన్స్ లేంటి అనే ఆశ్చర్యం కలుగుతుంది. మరి మనుషులను బతకటానికి ఆక్సిజన్ ఇచ్చే చెట్ల గురించి..వాటి ఆరోగ్యం గురించి ఆలోచించకపోతే ఎలా అనుకుంది చండీగఢ్ పర్యావరణ శాఖ. అలా జబ్బు పడిన చెట్ల కోసం అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది. మొక్కలకూ ప్రాణం ఉంటుంది..అవి స్పందిస్తాయని ఎన్నో ప్రయోగాలు నిరూపించాయి. దాన్ని చండీగఢ్ అధికారులు ఆచరించి చూపిస్తున్నారు.

జబ్బుపడ్డ వృక్షాలకు చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. క్రిమి కీటకాలతో..చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని చండీగఢ్ పర్యావరణ శాఖ తెలిపింది. అంతేకాదు చెట్లు జబ్బు పడినట్లుగా అంటే..చెట్ల ఆకులు వాడిపోయి గానీ..లేదా చెట్ల కాండాలు ఆరోగ్యం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తే తమకు సమాచారం అందించాలని..ఓ ప్రత్యేకమైన ఫోన్ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని పర్యావరణ అధికారి దేవేంద్ర దలై అనే అధికారి ప్రకటించారు.అంటే చెట్లకు చెదపురుగులు పట్టి ఉండటం..పలు కీటకాలతో అనారోగ్యంపాలైన చెట్ల గమనించి ప్రజలు సమాచారం అందించాలని కోరారు. అలా తమకు సమాచారం అందితే చెట్లకు చికిత్స చేయటానికి అంబులెన్స్ లో ఓ బృందాన్ని పంపిస్తామని తెలిపారు.

Related Tags :

Related Posts :