లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

పెళ్లివేడుకలో సినిమా సీన్..బంధువుగా నటిస్తూ..డైమండ్ రింగ్ చోరీ

Published

on

Chandigarh: ఛండీగఢ్ లోని ఓ పెళ్లి కార్యక్రమంలో సినిమా సీన్ ను తలపించే ఘటన జరిగింది. కరోనా కాలాన్ని ఉపయోగించుకుని ఓ వ్యక్తి చక్కగా డైమండ్ రింగ్ తో పాటు మూడున్నర లక్షల రూపాయల్నీ దోచుకుపోయిన ఘటనతో పెళ్లి వాతావరణంకాస్తా గందరగోళంగా మారిపోయింది. కరోనా సమయంలో జరిగే పెళ్లికాబట్టి మాస్కులు ధరించిన వ్యక్తిని ఎవ్వరూ అనుమానించలేదు. దీంతో సదరు వ్యక్తి రూ.3.5 లక్షల నగదుతో పాటు ఓ వజ్రాల ఉంగం పట్టుకుని ఉడాయించాడు. దీంతో సదరు పెళ్లి బృందం లబోదిబోమంది.


ప్రేమ,పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం


వివరాల్లోకి వెళితే..గత బుధవారం (అక్టోబర్ 21,2020) పగటి సమయంలో సెక్టార్ 22 ప్రాంతంలో ఉండే హోటల్ సన్ బీమీలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఆ పెళ్లికి సెక్టార్ 49 ప్రాంతానికి చెందిన ఉషాఠాకూర్ అనే మహిళ నూతన వధూవరులకు గిఫ్టుగా ఇవ్వటానికి ఎన్వలప్ కవర్ లో ప్యాక్ చేసిన ‘వజ్రాల ఉంగరం’’తీసుకొచ్చారు. పెళ్లి కార్యక్రమం సందడి సందడిగా జరుగుతోంది. పెళ్లివారంతా ఎవరి సందడిలో వారున్నారు. పెళ్లికొచ్చినవారంతా పెళ్లి గురించి నూతన వధూవరుల గురించి మాట్లాడుకుంటున్నారు.


ఇంతలో ఇంతలో సందట్లో సడేమియాలాగా మాస్క్ ధరించిన ఓ వ్యక్తి మెల్లగా పెళ్లి జరిగే ప్రాంతానికి వచ్చాడు. అందినకాడికి చక్కగా చక్కబెట్టేసుకున్నాడు. చల్లగా జారుకున్నాడు. కరోనా సమయం కాబట్టి మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని ఎవ్వరూ అనుమానించలేదు.


ఆ తరువాత ఉషా ఠాకూర్ నూతన దంపతులకు గిప్టుగా ఇద్దామనుకున్న డైమండ్ రింగ్ ఉన్న కవర్ కనిపించకుండా పోవటంతో లబోదిబోమంది. ఎవరో తన డైమండ్ రింగ్ కవర్ ఉండే తన పర్సు కనిపించకుండాపోవటంతో కంగారుపడిపోయింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా..వారు హుటాహుటిన వచ్చి అక్కడ ఉండే సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ఓ ముసుగు ధరించిన వ్యక్తి వచ్చి చోరీ చేశాడని తేలింది.


మాస్క్ అసలే కరోనా సమయం కాబట్టి వేసుకున్న ఓ వ్యక్తి పెళ్లివారి బంధువులా నటిస్తూ రూ. 3లక్షల నగదుతో పాటు సదరు పెళ్లికి వచ్చిన అతిథి డైమండ్ రింగ్ పర్సు కూడా దోచుకుపోయాడని గుర్తించారు.


దొంగను కనిపెట్టడానికి పోలీసులు దొంగతనం కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. ఫుటేజ్ లోని నిందితుడి ఫోటోలను బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పొరుగు రాష్ట్రాలకు పంపించారు. అతని ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *