chandrababu fires over YCP Govt

ఇసుక ఉచితంగా ఇస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయి : చంద్రబాబు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదని విమర్శించారు.

కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదని విమర్శించారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని, వారి చావులకు ప్రభుత్వమే కారణమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బుధవారం (నవంబర్ 6, 2019) నిర్వహించిన చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 30 లక్షల మంది కార్మికులు తిండి లేక బాధపడుతున్నారని తెలిపారు. కాలం చెల్లి కార్మికులు చనిపోతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రులు ఉండాలన్నారు.  

ప్రభుత్వం ఆంబోతు మాదిరిగా తయారైందని, రెచ్చిపోతున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, జైలులో పెట్టారని మండిపడ్డారు. అందుకే చలో ఆత్మకూరుకు పిలుపిస్తే చేతకాని పోలీసులు తన ఇంటి గేటుకు తాళ్లు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తాళ్లు మీకు ఉరితాళ్లుగా తయారవుతాయని ఆ రోజే చెప్పానని గుర్తు చేశారు. ప్రజావేదికపై జగన్ కన్ను పడి, దాన్ని కూల్చివేశారని మండిపడ్డారు. తనకు ఇళ్లు కూడా లేదని.. కానీ జగన్ కు హైదరాబాద్, బెంగళూరు, పులివెందుల..ఎక్కడా చేసినా ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. జగన్ ను పులివెందులకు పంపిస్తామని, వదిలిపట్టే ప్రస్తక్తే లేదన్నారు. ఎవరైనా చెత్త, పనికిమాలిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డే అని అన్నారు. పది మంది ముఖ్యమంత్రులను చూశానని.. ఎవరికైనా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు వచ్చాయా అని అడిగారు.

ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి కావాలి.. కానీ ప్రజలకు నష్టం చేసే, రాజకీయ పార్టీలను లేకుండా చేయాలంటే అది ఏవిధంగా సాధ్యమన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి బోనులో నిలబడే ముఖ్యమంత్రికి తమను విమర్శించే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని, 11 ఛార్జీషీట్లు వేయించుకుని ఏ1 కింద కోర్టుకు వెళ్లి, జైలుకు పోయివచ్చిన వ్యక్తికి టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. టీడీపీ కార్యకర్తలను మానసికంగా, శారీరంగా, రాజకీయంగా బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ఇలాంటి ముఖ్యమంత్రిని చూశారా అని అన్నారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మారితే ఎన్నో ఇబ్బందుల్లో వస్తాయో ఇప్పుడు తెలుస్తందన్నారు. పంచాయతీ రాజ్ కాంట్రాక్టర్ ను పంచాయతీ రాజ్ మినిస్టర్ చేయడం.. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. 5 గంటలైతే వీడియో గేమ్ ఆడుకుంటున్నాడని..జగన్ ది వింత ప్రవర్తన అన్నారు. 

READ  మావోయిస్టులు లేరు..కమిషనర్ వ్యాఖ్యలు బాధాకరం - అశ్వత్థామరెడ్డి

తనకు పోలీసులపై కోపం లేదని..వారు ప్రభుత్వం చెప్పినట్లుగా వింటారని చెప్పారు. సుబ్రహ్మణ్యంను గంగలో కలిపేశారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి కాపాడాలన్న కాపాడలేని పరిస్థితి వస్తుందని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెట్టొద్దన్నారు. పోస్టింగ్ కోసం ఇష్టానుసారంగా వ్యవహిరస్తే ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.
నీతి, నిజాయితీ, విశ్వసనీయతకు మారు పేరు టీడీపీ అని అన్నారు. ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టిన ఘనత టీడీపీది అన్నారు. 2003లో తీవ్ర వాదుల సమస్యను పరిష్కారం చేసి లా ఆండ్ ఆర్డర్ కాపాడనని తెలిపారు. మత విద్వేషాలను కంట్రోల్ చేసి, మత సామరస్యాన్ని కాపాడానని చెప్పారు. ముఠా నాయకత్వాన్ని పూర్తిగా అణచివేసి, రౌడీయిజాన్ని నిర్మూళించానని చెప్పారు. తనపై 24 క్లేమోర్ మైన్స్ ను ప్రయోగిస్తే సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి కాపాడాడు తప్ప ఇంకోటి కాదన్నారు. ఆ రోజు కూడా తన ప్రాణానికి భయపడలేదని, ఇప్పుడు కూడా భయపడనని చెప్పారు.

పేదవాడి ఆరోగ్యం కోసం దోమలపై పోరాడానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దోమలను పెంచారని చెప్పారు. టీడీపీని ఏమీ చేయలేరని చెప్పారు. ఆరోగ్యం బాగాలేకపోయిన ఎంపీ శివప్రసాద్ ప్రజల కోసం పని చేశారని తెలిపారు. తన బాల్య స్నేహితుడని.. తాను రమ్మంటే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. రాజకీయాలకు కూడా గౌరవం తెచ్చిన వ్యక్తి అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి మనకు ఉందన్నారు. మనందరం అంకిత భావంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ అన్యాయానికి బలైపోయిన వ్యక్తి కోడెల శివప్రసాద్ అన్నారు.  
 

Related Posts