బీజేపీకి బాబు కరోనా రిపోర్ట్‌ల రాయబారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసిందంతా ఒక్కటే రాజకీయం. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎప్పుడూ ఇంత ఖాళీగా లేరు. రాజకీయ నాయకులన్న తర్వాత ఖాళీ సమయాల్లో రకరకాల వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ, చంద్రబాబు మాత్రం పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు. అందుకే ఈ కరోనా కాలంలోనూ రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి నుంచి ఇప్పటివరకు ఒకటి రెండు సార్లు మాత్రమే చంద్రబాబు బయటికి వచ్చారు. పార్టీ మహానాడు సందర్భంగా మొదటిసారి హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు విజయవాడ వచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ నాలుగు నెలల్లో చంద్రబాబు లాంటి బిజీ పొలిటిషన్ తన నివాసంలో ఏం చేస్తున్నారనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఆయనేమీ ఖాళీగా ఇంట్లో కూర్చోలేదని పెద్ద స్కెచ్‌ సిద్ధం చేసుకున్నారని తెలుగు తమ్ముళ్ల సమాచారం.

ఏ పని చేసినా తమ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడాలని నాయకులు కోరుకుంటారు. ఢిల్లీతో తెగిపోయిన సంబంధాలను ఇప్పుడు పునరుద్ధరించుకునే పనిలో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా తానే చైర్మన్‌గా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ఫౌండేషన్‌ను స్థాపించారు. కరోనాపై పోరులో భాగంగా పలువురు మేధావులతో కలసి మేథోమధనం చేస్తున్నారు. దీనిలో రిటైర్డ్ ఐఏఎస్‌లు, ప్రముఖ డాక్టర్లు, ఐటీ, ఫార్మా రంగ నిపుణులు, పలువురు ఎన్నారైలు ఉన్నారు. వీరందరితో నిరంతరం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడుతూ వ్యూహాలు రచిస్తున్నారట.

కరోనా పుట్టుక దగ్గర్నుంచి ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఏ విధంగా విస్తరించింది? దాని స్వరూపం ఏమిటి? తదితర అంశాలపై చాలా లోతుగా ఈ ఫౌండేషన్‌ అధ్యయనం చేస్తుంది. మార్చిలో చంద్రబాబు ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. కరోనాను అరికట్టడానికి తీసుకున్న చర్యలను సమీక్షించడం, లోపాలపై కొన్ని సూచనలతో నివేదికలు తయారు చేయటం, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు పంపించే పనిలో చంద్రబాబు బిజీగానే ఉన్నారట. ఈ ఫౌండేషన్లో సభ్యులంతా ఆయా రంగాల్లో ప్రముఖ వ్యక్తులు కావడంతో ఢిల్లీ పెద్దలు కూడా ఆ నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు.

ఏప్రిల్ నెలలోనే ప్రధాని మోదీకి ఓ నివేదిక చంద్రబాబు పంపించారు. ఆ తర్వాత ప్రధాని స్వయంగా చంద్రబాబుతో మాట్లాడారు. తన ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రధానికి వివరించారు చంద్రబాబు. ఈ క్లిష్ట సమయంలో చాలా విలువైన సలహాలు, సూచనలు ఈ ఫౌండేషన్ ఇస్తుందని ప్రధానికి సలహా ఇచ్చారట ఆయన పేషీ అధికారులు. దీంతో చంద్రబాబు, ఆయన పౌండేషన్ నుంచి ఎటువంటి నివేదికలు ప్రధాని ఆఫీసుకి వెళ్ళినా వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ప్రధాని కార్యాలయంలోని ఒక అధికారితో ఫౌండేషన్ నిరంతరం చర్చిస్తోందని అంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 15 నివేదికల వరకూ ఈ ఫౌండేషన్ తరఫున ప్రధాని కార్యాలయానికి పంపించినట్లు సమాచారం.

READ  ముంబై నార్త్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ

ఈ ఫౌండేషన్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు. కరోనాపై లోతైన అధ్యయనం చేస్తూనే బీజేపీతో పాత సంబంధాలను పునరుద్ధరించే పనిలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. సంవత్సర కాలంగా బీజేపీని ఏదో విధంగా సెట్ చేసుకోవాలని టీడీపీ నేతలు భావించినా అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ ఫౌండేషన్ పేరుతో మొదటిసారిగా మోడీతో చంద్రబాబుకు మళ్లీ మాటలు కలిశాయట. మున్ముందు ఈ ఫౌండేషన్ నివేదికల పేరుతో బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లోకి వెళ్తూ.. మరింత దగ్గరవుతారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సంబంధాలు మళ్లీ బలపడతాయని టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారట.

Related Posts