‘నాంది’ – విభిన్నపాత్రలో ప్రవీణ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అల్లరి నరేష్ కెరీర్లో ఫస్ట్ టైమ్ సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం ‘నాంది’.. ఈ సినిమాలో నరేష్ లుక్ చూసి ప్రేక్షకులు షాకయ్యారు. నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ ఉన్న నరేష్ లుక్ ఆసక్తికరంగా అనిపించింది. శనివారం విడుదల చేసిన నరేష్ టెర్రిఫిక్ లుక్‌కి మంచి స్పందన లభించింది.

 

తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవీణ్ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటివరకు కామెడీ క్యారెక్టర్లతో అలరించిన ప్రవీణ్ తొలిసారిగా ఈ మూవీలో సంతోష్ అనే ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. Ready to witnesss FIR (First lmpact reveal) on June 30th అంటూ అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది చిత్రబృందం.

Related Posts