లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

యూపీలో చాట్ వ్యాపారుల అరాచకం : కస్టమర్ల కోసం కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టుకున్నారు

Published

on

Chat merchants beaten for customers : ఎదుటి వాడు మనకంటే ఎందులోనైనా కాస్త ఎక్కువైతే కొందరికి అదోరకమైన కడుపు మంట. ఆ మంటే అక్కడ గ్యాంగ్‌ వార్‌కు కారణమైంది. లాక్‌డౌన్ దెబ్బకు వీధి వ్యాపారాలన్నీ కుదేలైన వేళ.. అరకొరగా వస్తోన్న కస్టమర్ల కోసం దుకాణదారులు కొట్లాడుకున్న తీరు కలవరం పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘర్షణ వీడియో నెట్టింట సంచలనంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ సిటీలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం కాస్త భయానక దాడి వరకు వెళ్లింది. కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగి నానా హంగామా సృష్టించారు. విక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీధి రౌడీలను మించి కొట్లాడుకున్న వీరు నిజానికి వీధి వ్యాపారులు. కస్టమర్ల విషయంలో ఇద్దరు చాట్ షాపు యజమానుల మధ్య మొదలైన వాగ్వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వీరికి మద్దతుగా మరి కొంత మంది సీన్‌లోకి దిగడంతో పెద్ద గలాటా చెలరేగింది.

బాగ్‌పట్ సిటీలో చాట్ దుకాణాలకు ప్రసిద్ధి. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు అక్కడి చాట్ వ్యాపారులు ఏవేవో ఉపాయాలు రచించారు. కానీ ఒక వర్గం ప్రయత్నాలను మరో వర్గం అడ్డుకుంది. అలా వాదనతో మొదలై, చివరకు తలలు పగలకొట్టుకునేంత వరకూ వెళ్లింది. దాడుల విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.