లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఓటు వేశారు..YCPకి ఓటు వెయ్యలేదు..TDPకి వేశారు..కానీ చెల్లలేదు..బాబు వ్యూహానికి చెక్‌

Published

on

Check for a TDP Chief Chandrababu strategy Rajya Sabha Election

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. బలం లేకపోయినా బరిలోకి దిగిన టీడీపీ అందరూ ఊహించినట్లే ఓటమి పాలైంది. రెబల్ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు టీడీపీ రచించిన వ్యూహం రివర్సయ్యింది. ఈ వ్యూహానికి చెక్‌పెడుతూ ముగ్గురు ఎమ్మెల్యేలు సరికొత్త ఎత్తువేశారు. ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు షాక్‌ ఇచ్చారు.

రెబల్‌ ఎమ్మెల్యేల షాక్ : – 
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఊహించని విధంగా చంద్రబాబుకు దెబ్బకొట్టారు. రాజ్యసభ ఎన్నికల ద్వారా టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టే అవకాశం వస్తుందని ఊహించిన పార్టీ పెద్దలకు వాళ్లు అంతకంటే ఊహించని షాక్‌ ఇచ్చారు. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల ద్వారా వైసీపీలో చేరిన ఎమ్మెల్యేకు ముక్కుతాడు వేయాలని చంద్రబాబు వ్యూహం పన్నారు.

విప్ జారీ చేసిన టీడీపీ: – 
టీడీపీ తమ సభ్యులందరికీ విప్‌ జారీ చేసింది. దీంతో ఆ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీకే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక వేళ విప్‌ ధిక్కరిస్తే.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని  స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని టీడీపీ భావించింది. పార్టీ విప్‌ ధిక్కరించి వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే.. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని ఎదురు చూసింది. 

చెల్లని ఓట్లు : – 
టీడీపీ ఒకరంగా ఊహిస్తే.. రెబల్‌ ఎమ్మెల్యేలు మరో ఎత్తు వేశారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌ ముగ్గురూ చివరి నిముషంలో తమ ఓటు వేశారు. దీంతో టీడీపీ తరపున మొత్తం 21 ఓట్లు పోలయ్యాయి. అయితే ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేసి ఉంటారా అని టీడీపీ శ్రేణులు ఆరా తీశాయి. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒకటో ప్రాధాన్యత కింద నంబర్‌ వేయాల్సిన చోట.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టిక్‌ పెట్టారు. దీంతో వారి ఓట్లు చెల్లలేదు.

బ్యాలెట్ పేపర్ పై ఎమ్మెల్యే రాతలు: – 
ముగ్గురూ ఓటింగ్‌లో పాల్గొన్నారు.. వైసీపీకి ఓటు వెయ్యలేదు.. టీడీపీకి వేశారు కానీ చెల్లేదు. ఈ ముగ్గురు ఎమ్మెల్యే ఎత్తుగడతో చంద్రబాబు వ్యూహానికి చెక్‌ పడినట్టు అయ్యింది. ఇక టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లకుండా పోయింది. ఆమె ఒకటో నంబర్‌ రాయాల్సినచోట టిక్‌ పెట్టారు. దీంతో ఆమె ఓటు కూడా చెల్లేదు. ఇక పోలింగ్ సందర్భంగా బ్యాలెట్‌ పేపర్‌పై ఓ ఎమ్మెల్యే రాసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకా సీటు ఇచ్చేది అని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే ఎవరనేది హాట్‌టాపిక్‌గా మారింది. 

అనుకున్నది సాదించిన వైసీపీ:  
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అనుకున్నది సాధించింది. నాలుగు స్థానాలు గెల్చుకుంది. వైసీపీ తరపున పోటీచేసిన మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణతోపాటు.. అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీలు విజయం సాధించారు. ఈ నలుగురికి 38 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఈ నలుగురితోకలిపి… ఆరుకు పెరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో వెళ్లిన వైసీపీ అనుకున్నది సాధించింది. పోటీకి టీడీపీ అభ్యర్థిని నిలబెట్టినా.. వైసీపీ మాత్రం ఒక్క ఓటును కూడా కోల్పోలేదు. నలుగురు అభ్యర్థులను గెలిపించుకుని విజయఢంకా మోగించింది.

దెబ్బతిన్న టీడీపీ :  
ఇక టీడీపీయే రాజ్యసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. టీడీపీ వేసిన  వ్యూహం బెడిసి కొట్టింది. అనుకున్న ఓట్లు కూడా రాక.. బేజారెత్తింది. దీంతో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి వర్ల రాజమయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేర్వాత 20మంది ఎమ్మెల్యేలు ఆపార్టీకి ఉన్నారు. వారందరినీ కూడా టీడీపీ ఓటు వేయించుకోలేకపోయింది. ESI కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న  అచ్చెన్నాయుడు ఓటు వేయలేదు. ఇక క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్‌ క్వారంటైన్‌లో ఉండడం వల్ల ఓటు వేయలేకపోయారు. 

Read: ఏపీలో పేదల ఇళ్ల వద్దకే రేషన్.. వాహనాలు ఇవే.. పరిశీలించిన మంత్రులు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *