లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కిక్కు బాగా ఎక్కిన డాక్టర్..పోలీసులు వెహికల్ తీసుకెళ్లిపోయాడు

Updated On - 12:43 pm, Tue, 29 December 20

chennai drunk doctor drives away with police vehicle : మద్యం తాగొద్దని చెప్పే డాక్టరే బాగా తాగితే..పట్టుకున్న పోలీసులకు ఝలక్ ఇస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మద్యం మత్తు బాగా తలకెక్కిన ఓ యువడాక్టర్ ఏకంగా పోలీసులు వాహనం ఎక్కి దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయిన ఘటన చెన్నైలో జరిగింది. పోలీసుల మీద కోపంతో మధు గణేశ్‌ 31ఏళ్ల యువ డాక్టర్ పోలీసుల వాహనాన్ని వేసుకెళ్లిపోయాడు. సోమవారం (డిసెంబర్ 29,2020) తెల్లవారుజామున చెన్నైలోని కిల్పాక్‌లో జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులోని అరక్కోణంకి చెందిన డాక్టర్ గణేశ్ కుంద్రాతుర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. హారింగ్టన్ రోడ్డులో అర్ధరాత్రి 1.30 సమయంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. గణేశ్ మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకుపట్టుబడ్డారు. పోలీసులు ఆయనకు జరిమానా వేసి, కారును సీజ్ చేశారు.

ఆ తరువాత డాక్టర్ గణేశ్ అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత గణేశ్ 3.30 సమయంలో మళ్లీ తిరిగి వచ్చి తన కారు వెనక్కి ఇవ్వాలని పోలీసుల్ని అడిగాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేశాం కాబట్టి ఇప్పుడు ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పేసి.. మిగతా వాహనాలను తనిఖీ చేసే పనిలో పడ్డారు.

పోలీసులు తనను పట్టించుకోకుపోవటంతో డాక్టర్ గణేష్ కు చిర్రెత్తుకొచ్చిందంట..దీంతో అక్కడే ఉన్న ఓ పెట్రోలింగ్ వాహనం వేసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు ఓ బైక్‌తో డాక్టర్ గణేష్ ను కొన్ని కిలోమీటర్లు చేజ్ చేసి ఎట్టకేలకు పట్టుకున్నారు. గణేశ్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.