లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

తల్లేనా : ప్రియుడితో కూతురిపై అత్యాచారం చేయించిన తల్లి..బిడ్డకు జన్మనిచ్చిన చిన్నారి

Published

on

chennai Mother boy friend rapes 15 year old daughter : సమాజంలో బంధాలు..సంబంధాలకు అర్థం లేకుండా పోతున్న ఘటనలో ఆందోళన కలిగిస్తోంది. కన్నబిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి పేగు తెంచుకుని పుట్టిన ఆడబిడ్డ పట్ల అత్యంత దారుణానికి పాల్పడింది. భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి ఉంటు కన్నబిడ్డను తన ప్రియుడితో అత్యాచారం చేయించిన ఘటన చెన్నైలో సంలచనంకలిగించింది. దీంతో ఈమె తల్లేనా..అసలు మనిషేనా అని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఇటువంటివారి వల్ల అమ్మ అనే పవిత్రమైన బంధం కలుషితం అవుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

భర్తను వదిలేసి పరాయి వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె తన ప్రియుడితో కన్న కూతురిపైనే అనేకసార్లు అత్చాచారానికి పాల్పడేలా ఉసిగొల్పింది. ఆ కామాంధుడి చేసిన దారుణానికి ఫలితంగా కేవలం 15ఏళ్లున్న ఆ చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన ఆ బాలిక మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లితో పాటు ఆమె ప్రియుడిని గత బుధవారం (డిసెంబర్ 30,2020) అరెస్ట్ చేశారు.

తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని శోలింగనల్లూరుకు చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం భర్త నుంచి విడిపోయి 15ఏళ్ల కూతురితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ పెయింటర్‌తో పరిచయం ఏర్పడి అదికాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. తరుచూ ప్రియురాలి ఇంటికెళ్లే ఆ పెయింటర్ కన్ను ఆమె కూతురిపై పడింది. అదే విషయాన్ని ప్రియురాలికి చెప్పాడు. మొదటి ఆమె ఒప్పుకోలేదు. కానీ నీకూతుర్ని నాకు అప్పగించకపోతే నీకూ నాకూ ఎటువంటి సంబంధం ఉండదని అనటంతో ప్రియుడిని వదులుకోలేక కన్న కూతుర్ని ఆ కామాంధుడికి అప్పగించింది. దీనికి కూతురు ఒప్పుకోకపోవటం ఇద్దరూ కలిసి ఆ చిన్నారిని కొట్టేవారు. తరువాత కూతుర్ని బలవంతంగా అతడి గదిలోకి పంపేది. దీంతో ఆ కామాంధుడు బాలికపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతురిని బెదిరించింది ఆ తల్లి. ఆ తరువాత ఆ కూతురు కూడా కామంతో కళ్లు మూసుకుపోయిన ఆమెకు బరువైపోయింది. నాకు భర్త వదిలేశాడు దీన్ని పెంచలేకపోతున్నానంటూ తన అన్న ఇంట్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది.

అలా మేనకోడల్ని పెంచుతున్న మేనమామకు ఆ చిన్నారి శరీరంలో మార్పులు గమనించిన ఆరా తీశాడు. దీంతో పాపం ఆ చిన్నారి ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను సోదరి ఉండే ప్రాంతానికి వెళ్లాడు. కానీ అప్పటికే అప్పటికే ప్రియుడితో వెళ్లిపోయిదని తెలుసుకుని మడిపక్కం మహిళా పోలీసులకు తన మేనకోడలి పరిస్థితి వివరించి ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను పునరావాస కేంద్రానికి తరలించి పరారీలో ఉన్న ఆమె తల్లి, ప్రియుడి కోసం గాలిస్తున్నారు. కాగా ఈ క్రమంలో బాధిత బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికి గాలింపు ప్రయత్నాలు ఫలించి బాలిక తల్లి, ఆమె ప్రియుడు డిసెంబర్ 30న పోలీసులు పట్టుకున్నారు. బాలిక జీవితాన్ని నాశనం చేసిన వారిద్దరిని కఠినంగా శిక్షించాలని మేనమామతో పాటు స్థానికులు కోరుతున్నారు.