పొల్యూషన్ టూ పచ్చదనం : టపాసులు కాల్చిన వ్యర్ధాల నుంచి మొలకలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

chennai ngo diwali trash to treasure trove of saplings : కాల్చలేని టపాసులు..మొలకలు వచ్చే టపాసుల్ని కొంతమంది మహిళలు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే దీపావళికి ముందు ఈ కాల్చలేని టపాసుల్ని అమ్మితే..దీపావళి తరువాత టపాసుల వ్యర్థాలతో మొక్కలను తయారు కమ్యూంట్రీ చేస్తోంది. ఈ సంస్థ పేరు ‘కమ్యూంట్రీ’.దీపావళి అంటే టపాసులతో సందడి చేసే పండుగ. కానీ ఈ కరోనా కాలంలో టపాసులు కాల్చి మరిన్ని సమస్యలకు కారణం కావద్దు కాబట్టి బాణసంచాకాల్చొద్దని చెబుతున్నా చాలామంది వినలేదు.కరోనా అని కూర్చుంటే పండుగలు చేసుకోవద్దా..సంతోషంగా ఉండొద్దా? అనే కోణంలో ఆలోచించిన కొంతమంది టపాసుల మోత మోగించారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చిన వ్యర్థాలు పేరుకుపోయాయి. కాలుష్యం కూడా పెరిగింది. కాల్చి పారేసిన టపాసులు,వాటి ప్యాకింగ్ లు, స్వీట్ బాక్సులు వంటి తదితర వ్యర్థాలు వీధులు నిండిపోయాయి. దీపావళి మరుసటి రోజు వీధుల్ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది.

 ఈ వ్యర్థాలంతా ఎక్కడికి వెళ్తున్నాయి? వాటిని ఏం చేస్తారు? అనే ప్రశ్న మీకెప్పుడన్నా వచ్చిందా? అసలు ఆలోచన వచ్చిందా? అంటే పండుగ చేసేసుకున్నాం..టపాసులు కాల్చేసుకున్నాం..సరదా తీర్చేసుకున్నాం..

ఇక ఆ వ్యర్థాల గురించి ఆలోచించే తీరికా..కోరికా కూడా జనాలకు లేదు. ఆ వ్యర్థాలు కొంత వరకు మురికి కాలువలకు అడ్డుపడటం, మరికొన్ని కాలిపోవడం, మిగిలినవి డంప్ యార్డ్ కు చేరుకుంటాయి. ఈ వ్యర్థాల్లో చాలా తక్కువ శాతం మాత్రమే రీసైకిల్ అవుతాయి.ఈ వ్యర్థాల రీసైక్లింగ్ లోంచి పచ్చని మొలకల్ని మొలిచేలా చేస్తోంది ఓ సంస్థ. చెన్నైకి చెందిన కమ్యూంట్రీ అనే ఎన్జీఓ కాలిపోయిన టపాసులు, రాకెట్లు, స్తూపాకార బాంబుల కేసులను సేకరిస్తోంది. ఐదు నుంచి ఆరు అంగుళాల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టపాసుల కేసులను సేకరించి వాటిని మొక్కలు పెంచేందుకు ఉపయోగిస్తోంది. చిన్న చిన్న మొక్కల్ని వీటిలో పెంచేందుకు ఉపయోగిస్తోంది.


 

వ్యర్థమనేది వ్యర్థంగా ఉన్నంత వరకు మాత్రమే వ్యర్థంగా మిగిలిపోతుందని కమ్యూంట్రీ ఎన్జీఓఓ నమ్ముతుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ..దీపావళి పండుగకు ఇంటి ఇంటికీ తిరిగి టపాసులు కాల్చవద్దని చెప్పలేమని..అది ప్రజల వ్యక్తిగత ఛాయిస్. వద్దని చెప్పలేం. కానీ కాలిస్తే కాలుష్యం పెరుగుతుందని మాత్రమే చెప్పగలం..అది ప్రజలు అర్థంచేసుకోవాలని అన్నారు.


కానీ ప్రజలు కాల్చిన టపాసుల వ్యర్థాల కేసులను మాత్రం ఇవ్వమని ప్రజలను అడగగలం..వాటిని సేకరించి వాటిలో మొక్కలను నాటవచ్చనీ..దీపావళి శనివారం (నవంబర్ 14,2020)మరుసటి రోజైనా ఒక్క ఆదివారం రోజే 50 వేల కేసులను సేకరించామని తెలిపారు. మీకు ఆసక్తి ఉంటే మీరు కాల్చిన టపాసుల కేసులను ఎన్జీఓకు ఇవ్వవచ్చని తెలిపామనీ లేదా..మీకు దీనిపై ఆసక్తి ఉంటే వాటిలో మీ ఇంట్లోనే మొక్కల పెంచేందుకు వాడొచ్చని సూచించారు.ఇలా పెంచిన మొక్కలను చెన్నై శివార్లలోని నర్సరీలో ఆరు నెలల పాటు పెంచుతారు. తర్వాత వివిధ ప్రదేశాల్లో నాటుతారు. వీటిలో పెరిగే మొక్కలు ఐదు అడుగుల వరకు పెరుగుతాయి. టపాసుల కేసులు బలమైన కార్డు బోర్డుతో తయారవుతాయని, ఇవి మొక్కలు పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుందని హఫీజ్ అన్నారు. నీరు పోసేటప్పుడు నీటిని నిలుపుకుంటుదని, దాన్ని నిర్వహించడం సులభమని వివరించారు.వేప, బీచ్, జాక్ ఫ్రూట్, జామ, అశోక, ఆమ్లా లాంటి చెట్ల జాతులకు చెందిన మొక్కలను పెంచవచ్చని తెలిపారు. క్రితం సంవత్సరం వారు 27వేల టపాసుల కేసులను సేకరించామనీ తెలిపారు. ఈ సంవత్సరం 80 వేల కేసులు సేకరించి వాటిలో మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హఫీజ్ తెలిపారు.

Related Tags :

Related Posts :