తల్లితో రాసలీలలు….. ప్రియుడ్ని హత్య చేసిన దత్త పుత్రుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రౌడీ షీటర్ ను హత్య చేశాడు ఓ దత్తపుత్రుడు. తనను చిన్నప్పటి నుంచి పెద్ద చేసినప్పటికీ, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నాడనే కోపంతో అమానుషంగా నరికి సముద్రంలో పారేశాడా యువకుడు.

తమిళనాడు, చెన్నైలోని రెడ్ హిల్స్ ఏరియాకు చెందిన రౌడీషీటర్ కరుప్పు ఆనంద్(45) పలు నేరాలు, చోరీలు, హత్యల కేసుల్లో నిందితుడు.  ఆనంద్ తిరువొత్తియూర్ అప్పర్ నగర్ కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత 20 ఏళ్ళుగా ఆ మహిళతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె ఇంటికి వచ్చి పోతూ ఆమెతో రాసలీలలు  సాగిస్తున్నాడు.

అనాధ అయిన ఆ మహిళకు పిల్లలు లేకపోవటంతో ఒక బాలుడ్ని పెంచి పెద్దచేసింది. పలు చోరీ, మర్డర్ కేసుల్లో నిందితుడుగా ఉన్న కరుప్పు ఆనంద్ కూడా పిల్లవాడి పట్ల సుముఖంగానే ఉండేవాడు. కానీ ఇటీవల కాలంలో కరుప్పు ఆనంద్ తనకు ఇబ్బంది కలిగిన పలు నేరాల్లో ప్రియురాలి దత్త పుత్రుడు ఇమ్రాన్(25) ను ఇరికించి తాను తప్పించుకోవటం మొదలెట్టాడు.  ఈ క్రమంలో ఇమ్రాన్ పేరు, కరప్పుఆనంద్ అనుచరుడిగా పోలీసు రికార్డుల్లో నమోదయ్యింది.

ఇది నచ్చని ఇమ్రాన్ కు క్రమంగా ఆనంద్ పై కోపం పెరిగింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని రాసలీలలాడటమే కాక, కరుప్పు చేసిన నేరాల్లో అక్రమంగా తనను ఇరికించటాన్నిజీర్ణించుకోలేక పోయాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది.

ఓ రోజు రాత్రి ఆనంద్ తన ప్రియురాలి ఇంటికివచ్చి ఆమెతో సరసాలాడసాగాడు. అప్పటికే కరుప్పు ఆనంద్ పట్ల తీవ్ర వ్యతిరేకతో ఉన్న ఇమ్రాన్  కేసుల విషయమై ఆనంద్ తో మళ్లీ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తారా స్ధాయికి చేరింది. నాకే ఎదురు చెపుతావా అంటూ ఆనంద్ ఇమ్రాన్ పై కత్తితో దాడి చేయబోయాడు. అప్రమత్తమైన ఇమ్రాన్ సమీపంలోని కర్రతో కొట్టి కత్తిని లాక్కుని ఎదురుదాడి చేసాడు. ఆనంద్ మెడ, తల పై విచక్షణా రహితంగా పొడిచాడు. కత్తిపోట్లకు ఆనంద్ ఘటనా స్ధలంలోనే కన్నుమూశాడు.

అనంతరం తల్లి ప్రియుడి శవాన్ని తీసుకువెళ్లి సముద్రంలో పడేశాడు. మంగళవారం ఉదయం తిరువొత్తియూర్ పరిధిలోని కాశీమేడు సముద్ర తీరంలోకి ఒక శవం కొట్టుకు వచ్చింది. దాన్ని గమనించిన జాలర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విచారణకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతుడు రౌడీ షీటర్ గా గుర్తించారు. దీంతో పోలీసులు ఇమ్రాన్ ను విచారించారు. ఇమ్రాన్ జరిగినదంతా వివరించాడు. చేయని నేరాల్లో అక్రమంగా ఇరికిస్తున్నాడనే కోపంతో హత్య చేసినట్లు ఇమ్రాన్ వెల్లడించాడు.

READ  పెళ్లి ఆలస్యం అవుతోందని 19ఏళ్ల యువతి ఆత్మహత్య

Related Posts