లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

వీడు మహా ముదురు : మోసం చేసి 11 మందిని పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల యువకుడు

Published

on

Chennai young man marries 11 girls ,arrested : మొహం చూస్తే అమాయకుడిలా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న ఈ యువకుడు మహా ముదురు.   ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి వారిని, ఒకరికి తెలియకుండా మరోకరి చొప్పున 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అదేంటని పోలీసులు అడిగితే  ఇదినాకు మాములే అంటూ సమాధానం చెప్పాడు.  ఈ రసికుడ్ని అరెస్ట్ చేసి,   రాసలీలపై తమిళనాడులోని విల్లివాక్కం పోలీసులు విచారణ చేపట్టారు.

తమిళనాడు రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన లవ్లీ గణేష్(23) అనే యువకుడు కొలాత్తూర్ కు చెందిన 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు కనపడక పోయే సరికి అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కిడ్నాప్ కేసు నమోదైందని తెలుసుకున్న గణేష్ విల్లివాక్కం పోలీసుల వద్దకు వెళ్లి అత్తమామల నుంచి రక్షణ కల్పించమని వేడుకున్నాడు. పోలీసులు అమ్మాయి తల్లితండ్రులను పిలిపించారు.తమ కూతురు దొరికిందని సంబర పడ్డ వారికి నిరాశే మిగిలింది. ఆ యువతితల్లితండ్రులతో వెళ్ళటానికి ఇష్టపడలేదు.

తాను గణేష ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, అతినితో హ్యాపీగా కాపురం చేసుకుంటానని వారికి చెప్పింది. అనంతరం వాళ్లిద్దరూ విల్లివాక్కంలోని రాజాజీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఈ క్రమంలో అయనవరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ఇంట్లో పని చేయటానికి గణేష్ తీసుకువచ్చాడు. తామిద్దరం సంతోషంగా ఉందామనుకుంటే ఇంట్లోకి పనిమనిషి రావటాన్ని అతని భార్య వ్యతిరేకించింది. పనిమనిషిని పంపించేయమని చెప్పింది. కానీ గణేష్ అందుకు ఒప్పుకోలేదు.

ఈవిషయమై కొత్త దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో గణేష్ తన భార్యను ఒకగదిలో బంధించి తాళ్లతో కట్టేసి హింసించసాగాడు. ఇంటికి తీసుకువచ్చిన 17 ఏళ్ల బాలికతో భార్య ముందే సన్నిహితంగా మెలగటం ప్రారంభించాడు. ఇది తట్టుకోలేని భార్య తనను బయటకు పంపించి వేయమని ప్రాధేయపడింది. కొన్నిసార్లు బాలికను ఎదురుగా పెట్టుకుని, తన భార్య కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెతో సంభోగం జరిపేవాడు.

రోజు రోజుకు గణేష్ అరాచకాలకు అంతులేకుండా పోయింది. ఇంటికి తీసుకువచ్చిన 17 ఏళ్ళ బాలికకు మద్యం తాగించి ఆమె పై అత్యాచారం చేశాడు. దాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేసి తన స్నేహితులకు పంపించాడు. అది చూసిన స్నేహితులు నలుగురు ఇంటికి వచ్చారు. వారికి తన భార్యతో సుఖం అందించాలని నీచపు ఆలోచన గణేష్ కు తట్టింది. వారిని భార్యను బంధించిన గదిలోకి పింపించాడు.

తనపై లైంగిక దాడికి వచ్చిన నలుగురిని చూసిన ఆమె గట్టిగా అరుస్తూ ఏడవచం మొదలెట్టింది. దీంతో వారు భయపడి పారిపోయారు. వారితో పాటు బయటపడిన గణేష్ భార్య. ఇంటి యజమానికి జరిగిన విషయం చెప్పింది. అతడి సహకారంతో తన పుట్టింటికి చేరింది.

గణేష్ ప్రవర్తనను తల్లితండ్రులకు వివరించింది. వారు వెంటనే విల్లివాక్కం మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో గణేష్ షాకింగ్ విషయాలు చెప్పాడు.

తనకు ఇలాంటివి మామూలేనని ఇప్పటిదాకా ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం 11 మందిని పెళ్లి చేసుకున్నానని, వారందరితో నేను సరసాలాడుతున్నానని…. ఇది నాకు కొత్తేమి కాదని చెప్పే సరికి ఆశ్చర్యపోవటం పోలీసుల వంతు అయ్యింది.

తనకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయన్న విషయం ప్రస్తుత బాధితురాలికి కూడా తెలుసునని చెప్పాడు. నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలని, వారికి పోలీసు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కేసు విచారణదశలో ఉంది. కాగా…. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన విషయం రుజువవటంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.