Updated On - 6:22 pm, Sat, 20 February 21
Chetan Sakariya mourns brother’s loss after 1.20 crore IPL deal : ఐపీఎల్ వేలంలో కొత్త ఐపీఎల్ కరోడ్ పతిగా చేతన్ సకారియా నిలిచాడు. వచ్చే సీజన్ కోసం చెన్నైలో జరిగిన మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ చేతన్ ను కొనుగోలు చేసింది. దేశీవాళీ క్రికెట్ లో సౌరాష్ట్ర జట్టుకు 22ఏళ్ల సకారియా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడుతున్న సకారియాను ఆర్ఆర్ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ కోసం ఆర్సీబీ ఆసక్తి కనబర్చింది. కానీ, రాజస్తాన్ రూ.1.20 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సకారియాను అందరూ ప్రశంసలతో మంచెత్తుతున్నారు. అందరూ ఇంటికి వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు.
సంతోకరమైన సమయంలో విషాద వార్త ఆలస్యంగా తెలిసింది. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తండ్రి ముందుగా చెప్పలేదు. గత నెలలో తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు లేటుగా చెప్పడంతో జీర్ణించుకోలేకపోయాడు. తన లైఫ్ లోఎంత ముఖ్యమైన ఐపీఎల్ టోర్నీలో చోటు దక్కించుకోవాలంటే వేలంలో అమ్ముడుపోవడం అంత ఈజీ కాదు. రెండేళ్ల నుంచి తన తండ్రికి ఉద్యోగం లేదు. టెంపో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంభాన్ని పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఇంట్లో టీవీ కూడా లేని పరిస్థితి. క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు పక్కంట్లో వెళ్లి చూసేవాడు. గత జనవరిలో సకరియా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ లో ఆడుతున్నానని తెలిపాడు. ఇంటికి తిరిగివచ్చేవరకు తమ్ముడు చనిపోయిన విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ్ముడు రాహుల్ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు.. తొందరగానే వస్తాడని చెప్పేవారు. కానీ నిజం చెప్పక తప్పలేదు. తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ సంతోషించేవాడంటూ బావోద్వేగానికి గురయ్యాడు.
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా క్రిస్ మోరిస్.. రూ.16.25 కోట్లకు రాజస్థాన్ కొనేసింది
గచ్చిబౌలి దివాకర్.. బ్రహ్మానందంను వాడేసిన సన్‌రైజర్స్
ఐపీఎల్ -13 : రాజస్థాన్ పై కోల్ కతా విజయం
ఐపీఎల్ – 13 : పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
IPL 2020: గేల్ 99, రాజస్థాన్ టార్గెట్ 186
సత్తా చాటిన సన్ రైజర్స్, ప్లే ఆఫ్ కు దూరమైన రాజస్థాన్