కొరడాతో కొట్టించుకున్న చత్తీస్​గఢ్ సీఎం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Chhattisgarh CM Bhupesh Baghel celebrated Govardhan puja, followed this ritual చత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అయితే,తనదే తప్పు చేసి శిక్షగా కొరడా దెబ్బలు తినలేదు. ఆయన కొరడాతో కొట్టించుకోవడానికి ఉన్న కారణం సంప్రదాయాలను పాటించడమే.సంప్రదాయాలను పాటించడంలో భాగంగానే సీఎం భూపేశ్ కొరడా దెబ్బలు తిన్నారు. దుర్గ్​ జిల్లా జజంగిరి గ్రామంలో సంప్రదాయంగా జరిగే గోవర్ధన్​పూజలో పాల్గొన్న సీఎం..ప్రజల శ్రేయస్సు కోసం చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకున్నారు. కాగా,దీపావళి అనంతరం జరిగే గోవర్ధన్​ పూజలో బఘేల్​ ప్రతీ సంవత్సరం ఇలా చేస్తారనే విషయం తెలిసిందే.ఓ వ్యక్తి కొరడాతో.. భూపేశ్ బఘేల్ చేతిపై పలుమార్లు కొట్టాడు. అయితే, ఇది తమ సాంప్రదాయంలో భాగమని స్థానికులు చెబుతున్నారు.

Related Tags :

Related Posts :