చత్తీస్ ఘడ్ లో పరువు హత్య : విషమిచ్చి చంపి, కాల్చివేసిన బంధువులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

chhattisgarh:చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. బంధువులు అయ్యే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారిని హత్య చేసి తగల బెట్టారు. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా, సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ లో పక్క, పక్క ఇళ్లల్లో నివసించే శ్రీహరి(21) ఐశ్వర్య(20)లు గత కొన్నాళ్లుగా ప్రేమించు కుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుని ఇంట్లో వాళ్లకు చెప్పారు. వారిద్దరి ప్రేమపెళ్లికి ఇరు కుటుంబాల్లో పెద్దలు అభ్యంతరం చెప్పారు.

తమ ప్రేమను పెద్దలు అంగీకరించక పోయేసరికి ప్రేమికులిద్దరూ గత సెప్టెంబర్ నెలలో ఇంటి నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. రెండు కుటుంబాలవారు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమికులిద్దరినీ తమిళనాడులోని చెన్నైలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 7 వారిని చెన్నై నుంచి స్వగ్రామం సుపేలా తీసుకువచ్చి, వారి తల్లితండ్రులకు అప్పగించారు.అప్పటినుంచి పోలీసులు వారి ఇళ్పపై నిఘా ఉంచారు. అక్టోబర్10, శనివారం రాత్రి గస్తీ తిరుగుతున్నపోలీసులకు ప్రేమికుల కుటుంబాల ఇళ్లపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు లోలపకు వచ్చి కుటుంబ సభ్యులను ప్రేమికులు శ్రీహరి, ఐశ్వర్యల గురించి అడిగారు. కుటుంబ సభ్యులు సరైన సమాధానం చెప్పకపోయేసరికి పోలీసులు వారి ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మిగిలిన కుటుంబ సభ్యులు నిజం చెప్పేశారు.

ప్రేమికులిద్దరికీ విషం పెట్టి చంపేసామని చెప్పారు. ఈఘటనకు సంబంధించి శ్రీహరి మేనమామ రాము, ఐశ్వర్య సోదరుడు చరణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాల గురించి ఆరా తీయగా …తగులబెట్టినట్లు నిందితులు షాకింగ్ విషయాలు చెప్పారు.నిందితులు చెప్పిన ఆధారాలతో పోలీసులు సుపేలా కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెవ్రాసిర్సా గ్రామంలోని శివనాధ్ నది ఒడ్డున సగం కాలిపోయిన ప్రేమికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related Posts