లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

ఇన్ ఫార్మర్ల నెపంతో 25 మందిని ఊచకోత కోసిన మావోయిస్టులు

Published

on

Chhattisgarh: పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి మావోయిస్టులకు ద్రోహం చేస్తున్న పార్టీకి చెందిన 25 మంది గిరిజనులని ప్రజా కోర్టులో శిక్షించినట్లు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో పోలీస్‌ అధికారులు నియమించిన 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8 మంది ఇన్‌ఫార్మర్‌లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో శిక్షించామని ఆ లేఖలో పేర్కోంది. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడేందుకు ఈ చర్య చేపట్టినట్లు పార్టీ తెలిపింది.ఈ ఘటనకు బస్తర్‌ పోలీస్‌ ఐజీ సుందర్‌ రాజ్‌, బీజాపూర్‌ ఎస్‌పీలే భాద్యులు అని మావోయిస్ట్‌ పార్టీ తన ప్రకటన ద్వారా వెల్లడించింది. గతకొంతకాలంగా వీరు మావోయిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.

‘ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు వస్తున్నారని, పోలీసులే బాంబులు పెట్టి అమాయకులు చంపి తమపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 మంది పార్టీ నేతలను ఎన్‌కౌంటర్‌ చేశారు. కార్యకర్తలను హత్య చేశారు.డీజీపీలు, ఐజీలు హెలికాప్టర్లలతో తిరుగుతూ, కూంబింగ్‌ చేస్తూ ప్రజలను భయకంపితులకు గురిచేస్తున్నారని పార్టీ ఆరోపించింది. ఈ పాశవిక దామనకాండను ఖండిస్తూ 25 మంది ఏజెంట్లను ప్రజాకోర్టులో శిక్షించాం’ అని మావోయిస్ట్‌ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేర్కొంది.

ఇటీవల చంపిన విజ్జా పార్టీలోనే పని చేస్తూ, పోలీసుల సహకారంతో అధినాయకత్వాన్ని దెబ్బతీసేందుకు కృషి చేస్తున్నాడని ఆలేఖలో వివరించింది. గతంలో జరిగిన మావోయిస్టు పార్టీ రహస్య సమావేశాల ప్రదేశాలను వివారాలను విజ్జా పోలీసులకు రవేసాడని ఆరోపించింది.పార్టీలోని వివిధ స్ధాయి కార్యకర్తలకు పోలీసులు తుపాకీ పేల్చటంతో శిక్షణ ఇచ్చారని తెలిపింది. మహిళలు, పిల్లలపై అత్యాచారాలు చేసి, స్ధానిక నాయకులను చంపి పోలీసులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గోపీ అనే మరో కోవర్టు కూడా హత్య చేసిన వారిలో ఉన్నారని వికల్ప్ తెలిపాడు.

పోలీసు రక్షణ దళాలు గ్రామస్తులను దోచుకుంటున్నాయని…అమాయక యువకులను పోలీసు శిబిరాల్లో నెలరోజులుగా అదుపులోకి తీసుకున్నాయని… వారిని పోలీసుల కోసం పని చేయమని బలవంతం చేశారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో తెలిపారు.ఛత్తీస్‌గఢ్ లో ఖనిజ సంపదను దోచుకోవడానికి, దోపిడీ చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన ‘ఆపరేషన్ సమాధన్’ విఫలమైందని, 2022 నాటికి నక్సల్స్ ఉద్యమాన్ని నిర్మూలించాలనే వారి లక్ష్యం అసంభవం అని పోలీసులు అర్థం చేసుకున్నారని లేఖలో విమర్శించారు.

తమ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి మావోయిస్టులను నిర్మూలించటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. మేధావులు మరియు సాధారణ ప్రజలు పోలీసుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *