chief justice of india sa bobde on a harley davidson bike thrills

సూపర్ పవర్ బైక్ పై చీఫ్ జస్టిస్ చక్కర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే అంటే సంచలనాత్మక తీర్పులిచ్చే న్యాయమూర్తిగా పేరు. క్లిష్ట కేసులపై విచారణ చేయటం..సంచలనాత్మక తీర్పులు ఇచ్చే బోబ్డేలో మరోకోణం బైటపడింది. బోబ్డేకు బైకులంటే ఎంత ఇష్టమో తెలిపే ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా సూపర్ బైక్ ఆయనకు మరీ ఇష్టం.

హార్లే డేవిడ్‌సన్ లిమిటెడ్ ఎడిషన్ సీవీవో 2020 మోడల్‌ను ట్రయల్ రైడ్‌ చేసిన ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అబ్బా బైకులంటే కుర్రకారుకే కాదు ఈ 64ఏళ్ల వయస్సులో ఉన్న బాబ్డేకు కూడా ఇంత ఇష్టమా అని ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా బోబ్డే సొంతూరు నాగపూర్‌లోనే ఉంటున్నారు. ఆయన ఇటీవల నాగపూర్ బీజేపీ నాయకుడి కుమారుడు రోహిత్ సొంబాజి కొడుకుకు చెందిన 30 లక్షల రూపాయల విలువచేసే హార్లే డేవిడ్‌సన్ లిమిటెడ్ ఎడిషన్ సీవీవో 2020 మోడల్‌ను ట్రయల్ రైడ్‌ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈక్రమంలో కరోనా నిబంధనలను అతిక్రమిస్తూ జస్టిస్ బాబ్డే మాస్క్ పెట్టుకోలేదనీ..అలాగే బైక్ ట్రయన్ చేసిన ఆయన హెల్మెట్ కూడా పెట్టుకోలేదని విమర్శలు వస్తున్నాయి.

కాగా..2019 నవంబర్ లో భారతదేశ 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే ప్రమాణస్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ గా 17నెలల పాటు బాధ్యతలు నిర్వహించనున్న ఆయన 2021 ఏప్రిల్ 23న ఆయన పదవీవిరమణ చేస్తారు. న్యాయకోవిదుడైన జస్టిస్ బోబ్డే పలుకీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. అయోద్య కేసు విచారించిన ధర్మాసనంలోనూ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.

Read:విదేశీయులకు పుట్టినవారు దేశభక్తులు కాలేరు..ఈ గడ్డపై పుట్టినవారే దేశాన్ని కాపాడతారు

Related Posts