లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

చిన్నారుల్లో కరోనా తీవ్రత తక్కువ.. సిగరేట్ స్మోకింగ్‌‌తో ముప్పు ఎక్కువ!

Published

on

cigarette smoke raises risk : చిన్నారుల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, సిగరేట్, స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో కరోనా తీవత్ర ఎక్కువగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారిలోనూ కరోనా తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.కొత్త డేటా ప్రకారం.. కరోనా సోకినవారికి measles-mumps-rubella (MMR) వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వారిలో తీవ్రతను తగ్గించగల సామర్థం ఉందని పేర్కొంది.

మెర్క్ అభివృద్ధి చేసిన MMR II వ్యాక్సిన్ 1979లో లైసెన్స్ పొందింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలను ఉత్పత్తి అయి రోగనిరోధకత స్థాయిని బలపడేలా చేశాయని కనుగొన్నారు.చిన్నారులు సహా 42ఏళ్ల వయస్సు లోపు ఉన్న 50 మంది కరోనా బాధితులకు MMR II వ్యాక్సిన్ అందించారు. వీరిలో IgG యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని గుర్తించారు. అంతేకాదు.. వైరస్ తీవ్రత కూడా చాలా తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు.

లక్షణ రహిత పేషెంట్లలోనూ యాంటీబాడీలు సమృద్ధిగా పెరిగాయని రీసెర్చర్లు గుర్తించారు. కరోనా తీవ్రతను వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలదో రుజువు చేయాలంటే మరింత పరిశోధన చేయాల్సి ఉందని అంటున్నారు.అత్యధిక స్థాయిలో మొదటి MMR వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల్లో 12ఏళ్ల నుంచి 15ఏళ్ల వయస్సు వారు ఉండగా.. 4ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయస్సు చిన్నారులకు రెండో MMR వ్యాక్సిన్ అందించారు.

సిగరేట్, స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో కరోనా తీవ్రత ముప్పు అత్యధిక స్థాయిలో ఉందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ చేసేవారిలో గాలితంతు కణాల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశం అధికంగా ఉందని UCLA రీసెర్చర్లు కనుగొన్నారు.కరోనా సోకని ఐదుగురిలో సిగరేట్ స్మోకింగ్ చేయడం ద్వారా వారిలో కొన్ని శ్వాసకోశ కణాలు బహిర్గతమైనట్టు గుర్తించారు. వీరికి కరోనా వైరస్ సోకే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

స్మోకింగ్ ప్రభావం లేని కణాల కంటే స్మోకింగ్ ప్రభావానికి గురైన కణాలు రెండు లేదా మూడు రెట్లు అధికంగా కరోనా వైరస్ సోకే ముప్పు ఉందని రీసెర్చర్లు తేల్చేశారు. పొగ తాగేవారిలోని శ్వాసకోశ కణాలు వైరస్‌పై పోరాడే వ్యాధినిరోధకతను తగ్గించిందని విశ్లేషించారు.సాధారణంగా శ్వాసకోశాలు పెద్ద గోడల్లా ప్రొటెక్ట్ చేస్తుంది. సిగరేట్ స్మోకింగ్‌ కారణంగా గోడలకు రంధ్రాలు పడతాయని రీసెర్చర్ Brigitte Gomperts తెలిపారు.

సాధారణంగా వైరస్ ను ఎదుర్కోగల సామర్థ్యం తగ్గిపోతుందని, తద్వారా శ్వాసకోశ కణాల్లోకి వైరస్ ప్రవేశిందుకు అనుమతి ఇస్తుందని అంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *