కరోనా వైరస్ ను నివారించేందుకు అధికారులు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్ల తలుపులకు చెక్కలు పెట్టి.. మేకులు వేయడమే కాకుండా, ఇనుపు సంకెళ్లతో లాక్ చేస్తున్నారు.
కరోనా వైరస్ ను నివారించేందుకు అధికారులు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్ల తలుపులకు చెక్కలు పెట్టి.. మేకులు వేయడమే కాకుండా, ఇనుపు సంకెళ్లతో లాక్ చేస్తున్నారు. అదేంటీ తలుపులు మూసేస్తే కరోనా వైరస్ వ్యాపించటం తగ్గిపోతుందా? అని అనుకోవచ్చు…ఇదేం పిచ్చి పనులు..కరోనా దెబ్బకు చైనాలో అధికారులు నిజంగా పిచ్చిపట్టిందేమో అనే అనుమానాలు రావచ్చు.
కానీ వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రజల్ని కరోనా కాటు నుంచి కాపాడలేకపోతున్నారు. దీంతో అధికారులు ఇంటి తలుపులకు చెక్కలు పెట్టి..అవి ఊడిపోకుండా మేకులు కూడా కొట్టేస్తున్నారు.
కరోనా దెబ్బకు చైనా విలవిల్లాడిపోతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..నివారించలేకపోతోంది. పరిస్థితి అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. దీంతో అధికారులు ఇటువంటి చిత్ర విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ దెబ్బకు జనవరి 23 నుంచి చైనాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలు వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చైనాలో ఇప్పటివరకు 7,700 మంది ఈ వ్యాధికి గురికాగా, 170 మంది చనిపోయారు. ముఖ్యంగా ఉహాన్ నగరంలోనే ఎక్కువ మంది ఈ వ్యాధికి గురయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేయటంతో పాటు గబ్బిలాలు, పాములతోపాటు మరే జంతువులను ఆహారంగా తీసుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు అటువంటి జంతువులను కనీసం ముట్టుకునే సాహసం కూడా చేయవద్దని అటువంటి యత్నం కూడా చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కాగా..చైనాలో కరోనా సోకిన రోగులు ప్రజల్లోకి కలిసిపోయి ఇతరులక్కూడా వ్యాపింపజేస్తున్నారు. కొందరైతే జనాలపై ఉమ్ములేసి వైరస్ ఇతరులకు అంటిస్తున్నారు. బతికున్న గబ్బిలాలను, ఎలుకలను తింటూ వీడియోలు తీసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
రోగులను నియంత్రించడం అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. దీంతో వ్యాధి నిర్ధరణ జరిగిన రోగుల ఇళ్లకు వెళ్లి.. వారిని ఇంట్లోనే బంధించి తలుపులకు తాళాలు వేస్తున్నారు. ఇనుప సంకెళ్లతోపాటు తలుపులకు చెక్కలు వేసి మేకులు కొడుతున్నారు.