నిన్న ఇండియా, ఇప్పుడు అమెరికా.. బయటపడ్డ చైనా గ్లోబల్ హ్యాకింగ్, యూఎస్‌లో‌ దొరికిపోయిన డ్రాగన్ హ్యాకర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

10 వేల మంది భారతీయులపై చైనా నిఘా. ఈ న్యూస్ తెలిసి.. దేశం మొత్తం షాకైంది. కానీ.. ఇప్పుడలాంటిదే అమెరికాలో మరొకటి బయటపడింది. ఇందులో కూడా ఇండియాకు లింకుంది. యూఎస్‌తో పాటు విదేశాలకు చెందిన వంద కంపెనీలు, సంస్థలను చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఇందులో భారత ప్రభుత్వానికి చెందిన నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయ్.

ఐదుగురు చైనా పౌరులపై అమెరికా న్యాయ శాఖ హ్యాకింగ్ అభియోగాలు:
ఇండియాలో 10 వేల మందిపై చైనా సంస్థ గూఢచర్యం చేస్తుందన్న వార్తతో.. దేశం మొత్తం నివ్వెరపోయింది. అది మరువక ముందే.. యూఎస్‌లో డ్రాగన్ కంట్రీకి చెందిన హ్యాకర్స్ బయటపడ్డారు. భారత ప్రభుత్వ నెట్‌వర్క్‌లతో సహా అమెరికాతో పాటు విదేశాల్లోని వంద కంపెనీలు, సంస్థలను టార్గెట్ చేసి.. సైబర్ ఎటాక్స్ చేశారని తేల్చారు. విలువైన సాఫ్ట్ వేర్ డేటా, బిజినెస్ ఇంటలిజెన్స్‌ని దొంగిలించారని.. ఐదుగురు చైనా పౌరులపై అమెరికా న్యాయ శాఖ అభియోగాలు మోపింది.

ఈ కేసులో.. ఐదుగురు చైనా పౌరులు, వారికి సహకరించిన ఇద్దరు మలేషియన్లపై చార్జ్ షీట్ నమోదు చేశారు. మలేషియా పౌరులను అరెస్ట్ చేసినప్పటికీ.. చైనా పౌరులు పారిపోయినట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది.

సైబర్ ఎటాక్స్ వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ:
చైనా పౌరులు చేసిన హ్యాకింగ్, సైబర్ ఎటాక్‌లను దెబ్బతీసేందుకు.. అమెరికా న్యాయశాఖ అన్ని సాధనాలు ఉపయోగించిందని డిప్యూటీ యూఎస్ అటార్నీ జనరల్ జెఫ్రీ రోసెన్ చెప్పారు. తాము సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా.. చైనానే ఈ మార్గాన్ని ఎంచుకుందన్నారు.

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీనే.. తమ హ్యాకర్లతో ఇతర దేశాలపై సైబర్ ఎటాక్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. చైనాకు ఉపయోగపడే మేధో సంపత్తిని.. ఇతర దేశాల నుంచి దొంగిలించమని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్లే చెబుతున్నారని రోసెన్ అన్నారు.

కోబాల్ట్ స్ట్రైక్ అనే మాల్ వేర్‌ను ఉపయోగించి సైబర్ దాడులు:
చైనా హ్యాకర్లు కోబాల్ట్ స్ట్రైక్ అనే మాల్ వేర్‌ను ఉపయోగించి.. భారత ప్రభుత్వ కంప్యూటర్లపై సైబర్ దాడులకు పాల్పడ్డారని.. యూఎస్ తెలిపింది. వారి అభియోగాల ప్రకారం.. అమెరికాతో పాటు విదేశాల్లోని వంద కంపెనీల్లో కంప్యూటర్ చొరబాట్లు జరిగాయంటున్నారు. ఈ సైబర్ ఎటాక్‌లో.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ హార్డ్ వేర్, టెలికమ్యూనికేషన్, సోషల్ మీడియా, వీడియో గేమ్ కంపెనీలుగా బాధితులుగా ఉన్నాయని చెబుతున్నారు.

నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీలు, విదేశీ ప్రభుత్వాలు, మేధావులు, ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ నాయకులు, హాంకాంగ్‌లోని హక్కుల కార్యకర్తలను కూడా టార్గెట్‌గా పెట్టుకున్నారు.

READ  రేప్ కేసులకు ఉరిశిక్ష ఖరారు చేసిన బంగ్లాదేశ్

సెక్యూరిటీ రీసెర్చర్లు.. APT41, బేరియం, వింటి, వికెడ్ పాండా, వికెడ్ స్పైడర్ లేబుళ్ళను ఉపయోగించి చొరబాట్లను ట్రాక్ చేశారు. చైనీస్ హ్యాకర్ల చొరబాట్లు.. సోర్స్ కోడ్, సాఫ్ట్‌వేర్ కోడ్ సైనింగ్ సర్టిఫికెట్స్, కస్టమర్ అకౌంట్స్ డేటా, విలువైన బిజినెన్ సమాచారం దొంగిలించారని.. రీసెర్చర్లు తెలిపారు. చైనా హ్యాకర్ల లిస్టులో.. భారత ప్రభుత్వ నెట్‌వర్క్‌లు కూడా ఉండటం ఆందోళనకరమైన విషయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Related Posts