china-new-virus

కరోనా, జీ4 కన్నా డేంజర్.. చైనాని వణికిస్తున్న కొత్త రోగం బుబోనిక్ ప్లేగ్, 24 గంటల్లో మరణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసే వైరస్ లు, రోగాలకు చైనా కేరాఫ్ గా మారుతోంది. మనుషుల ప్రాణాలు తీసే వ్యాధులకు చైనా జన్మ స్థలంగా మారుతోంది. కొత్త కొత్త వైరస్ లన్నీ చైనాలోనే పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పటికే చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా, యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఈ వైరస్ నుంచి కోలుకోకముందే కొత్త వైరస్ లు చైనాలో బయటపడ్డాయి. మొన్న కరోనా, నిన్న జీ-4, నేడు బుబోనిక్ ప్లేగ్.. ఇలాంటి భయంకర వ్యాధులతో చైనా వైరస్ ల దేశంగా మారింది. ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. అది మరువక ముందే జీ-4 అనే కరోనాను మించిన వైరస్ కూడా తమ దేశంలో ఉన్నట్లు ఇటీవలే ప్రకటించి మానవాళికి షాక్ ఇచ్చారు చైనా పరిశోధకులు. ఇప్పుడు కరోనా, జీ-4ను మించిన మహమ్మారి మరొకటి తమ దేశంలో ఉందని ప్రకటించి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది చైనా.

కరోనా కన్నా డేంజర్:
తాజాగా చైనాని బుబోనిక్‌ ప్లేగ్(bubonic plague) అనే మహమ్మారి వణికిస్తోంది. ఇది కరోనాను తలదన్నేలా ఉంటుంది. చైనాకు ఉత్తర సరిహద్దులో ఉన్న ఇన్నర్ మంగోలియాలో బుబోనిక్ ప్లేగ్ తొలుత వెలుగుచూసింది. ఇది సోకిన వ్యక్తిని బయన్నూర్ సిటీ డాక్టర్లు గుర్తించారు. అతడి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వారందరిని గుర్తించి ఐసోలేట్ చేశారు. వాళ్లందరికి ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ముందస్తుగా స్థానికులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ ఏడాది చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సరైన ట్రీట్ మెంట్ అందకపోతే 24 గంటల్లో హరీ అనాల్సిందే:
ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే, బుబోనిక్ ప్లేగ్ తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈపాటికే బయన్నూర్ సిటీలో చాలామందికి బుబోనిక్ ప్లేగ్ వ్యాపించే ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. అసలు అది ఎప్పుడు మొదలైందో, ఎంతమందిలో ఉందో వంటి వివరాలను చైనా ప్రభుత్వం బయటకు రానివ్వడం లేదు. ప్రస్తుతం చైనా పొరుగు దేశమైన మంగోలియాలో కూడా బుబోనిక్ ప్లేగ్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు.. జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్‌ గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లు. వైరస్ సోకిన వ్యక్తికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వకుంటే, 24 గంటల్లోనే చనిపోతాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్లేగు మూడు రకాలు. వాటిలో ఒక రకం బుబోనిక్‌. ఈ ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్‌(Yersinia Pestis bacteria) అనే బ్యాక్టీరియా కారణం. ఇది ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా వాడుకుంటుంది. వాటిని తిన్నప్పుడు బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌ను కలగజేస్తుంది.

READ  ప్రియురాలిని ముక్కలుగా నరికిన ప్రియుడు.. శవాన్ని బ్యాగుల్లో పెట్టుకుని 400 మైళ్ల ప్రయాణం, ఎందుకిలా చేశాడో తెలిసి పోలీసులు షాక్

ఎలుకల మాంసం తినడం వల్ల కొత్త రోగం:
చైనీయుల దరిద్రపు ఆహార అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరుగులు, గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు, అడవి జంతువుల మాంసం, సముద్ర పాములు.. ఇలాంటివి అన్నీ తింటారు. వైరస్ ల దేశం అని చైనాని అమెరికా సహా ప్రపంచ దేశాలు తిట్టిపోస్తున్నా చైనీయుల దరిద్రపు ఆహార అలవాట్లలో మార్పు మాత్రం రావడం లేదు. కరోనా, జీ4 మాదిరిగా బుబోనిక్ ప్లేగ్ వైరస్ కూడా ఎలుకల మాంసం తినడం వల్లే మనుషులకు వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. మర్మోట్(marmots) జాతికి చెందిన ఎలుకల మాంసం తిన్న ఇద్దరికి ముందుగా ఈ వ్యాధి సోకిందని స్థానికి మీడియా జూలై 1న తెలిపింది. ఆ ఇద్దరితో కాంటాక్ట్ అయిన 146మందిని ఐసోలేట్ చేశారు. అందరికీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

ప్రపంచపటంలో కనిపించే ప్రతీ దేశంలోనూ కరోనా పంజా:
చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి మహమ్మారిగా మారింది. వుహాన్ లోని ఓ సీ ఫుడ్ మార్కెట్ నుంచి కరోనా వైరస్ జన్మించినట్టుగా చాలా దేశాలు నమ్ముతున్నాయి. చైనా నుంచి అన్ని దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ మానవాళి మనుగడకు సవాల్ విసిరింది. ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 5లక్షల 40వేల మంది చనిపోయారు. ప్రపంచపటంలో కనిపించే ప్రతీ దేశం కూడా కరోనా వైరస్ బారినపడింది. ప్రాణ నష్టాన్ని చవి చూస్తోంది. దీని ధాటికి అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్ వంటి దేశాలు కుదేలవుతున్నాయి. చైనాలో కరోనా కాటు మొదలై 9 నెలలు అయ్యింది. అయినా ఆ మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. రోజురోజుకి రూపాంతరం చెందుతోంది. వైరస్ ఉధృతమవుతూ మానవాళిని కబళిస్తోంది. వీలైనంత త్వరగా ఆ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో అగ్ర దేశాలన్నీ తలమునకలై ఉన్నాయి.

జీ-4 సోకిందంటే ప్రాణం పోవాల్సిందే:
కరోనా వైరస్ కు మందు కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్నీ నిమగ్నమై ఉన్న వేళ చైనాలో పుట్టిన మరో మహమ్మారి వివరాలు ప్రపంచానికి షాకిస్తున్నాయి. సోకిందంటే చాలు ఇక ప్రాణం పోవడం తప్ప మరో మార్గం లేని ఈ కొత్త వైరస్, అప్పుడే చైనాలోని 4 శాతం జనాభాకు సోకిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జంతువుల నుంచి మనుషులకు మాత్రమే సోకిన ఈ యమా డేంజరస్ వైరస్ ని జీ-4 వైరస్ గా పిలుస్తున్నారు. కరోనా తరహాలోనే ఈ వైరస్ కూడా మహమ్మారిలా వ్యాపించే ప్రమాదం ఉంది. దీనిపై అమెరికన్ సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. జీ4గా గుర్తించిన ఈ వైరస్ హెచ్1ఎన్1 నుంచి సంక్రమించినట్టు ప్రాథమికంగా నిర్థారించారు.

READ  బ్రేకింగ్ : భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్.. ఆ రాష్ట్రంలో తొలి కేసు నమోదు

జీ-4 వైరస్ తో మానవ జాతి అంతరించి పోయే ఉపద్రవం:
2011 నుంచి 2018 వరకు పరిశోధకులు 10 చైనా ప్రావిన్సుల్లోని పశువైద్య ఆసుపత్రుల్లోని పందుల కళేబరాల నుంచి 30వేల నాజిల్స్ తీసుకుని 179 స్వైన్ ఫ్లూ వైరస్ లను ఐసోలేట్ చేశారు. వాటిలో ఎక్కువ సంఖ్యలో కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ కూడా మనుషులకు సోకే చాన్స్ ఎక్కువగా ఉందని, వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా పందుల్లో సంక్రమించే వైరస్ మనుషులకు సోకుతుంటుందని, అదే తరహాలో జీ4 కూడా అవలీలగా మనుషులకు సంక్రమిస్తుందని చెప్పారు. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకడం అంత సులభం కాదన్నారు. ఒకవేళ కరోనాలానే మనుషుల నుంచి మనుషులకు సోకిందంటే ఇక మానవ జాతి అంతరించి పోయే ఉపద్రవం ఏర్పడుతుందని, సైంటిస్టులు హెచ్చరించారు. అందుకే ఈ కొత్త వైరస్ పట్ల చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు అలర్ట్ ప్రకటించారు.

ప్రపంచ దేశాలన్నీ కొంతకాలం చైనాతో సంబంధాలు తెంచుకుంటేనే మంచిది:
ఎన్ని కొత్త వైరస్ లు దాడి చేస్తున్నా చైనా తీరు మాత్రం మారడం లేదు. ఇప్పడీ కొత్త బుబోనిక్ ప్లేగ్ కు చెక్ పెట్టకపోతే ఇది మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఉత్తర చైనా, మంగోలియాకు పరిమితమైన బుబోనిక్ ప్లేగ్ మున్మందు విజృంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే కరోనాతో యుద్ధం చేస్తున్న ప్రపంచ దేశాలను జీ4, బుబోనిక్ ప్లేగ్ మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే చైనాతో కొంతకాలం ప్రపంచ దేశాలు సంబంధాలు తెంచుకుంటేనే మంచిదనే ప్రచారం ఊపందుకుంటోంది.

Read Here>>భారత్‌ దెబ్బకు తోక ముడిచిన చైనా.. గాల్వన్‌ లోయ నుంచి డ్రాగన్ సైన్యం వెనక్కి!

Related Posts