లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

బీజింగ్‌లో కరోనా విజృంభణ : 5 రోజుల్లో ఆస్పత్రి కట్టేసిన చైనా

Published

on

China builds hospital in 5 days : డ్రాగన్ చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్‌లో భారీగా కరోనా కేసులు నమోదుతున్నాయి. దేశంలోని హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో ఈ వారమే లాక్ డౌన్ విధించగా.. 28మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బీజింగ్ లో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుండటంతో చైనా అతి తక్కువ సమయంలోనే ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. కేవలం 5 రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించింది.

నాంగోంగ్‌లో మొత్తం 6,500 పడకలు ఉన్న ఆరు ఆస్పత్రుల్లో ఇదొకటిగా జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వచ్చేవారంలో అన్ని పడకల నిర్మాణం పూర్తివుతుందని అంచనా వేస్తోంది. చైనాలో ఒక్క శుక్రవారమే 168 కేసులు నమోదు కాగా.. కోవిడ్ కేసుల్లో చైనా 10 నెలల గరిష్టానికి చేరుకుంది.

గత ఫిబ్రవరిలో నమోదైన కరోనా కేసుల కంటే ఈ సంఖ్య చాలా తక్కువే. చైనా రోజువారీ కరోనా కేసుల్లో రికార్డు స్థాయిలో 15,000 కేసులను నమోదు చేసింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం.. శనివారం నాటికి చైనాలో 97,000 కేసులు నమోదు కాగా.. 4,700 మందికి పైగా మరణించారు.