లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

దశాబ్దాలలో తొలిసారి…భారత్ నుంచి బియ్యం కొనుగోలు చేస్తోన్న చైనా

Published

on

China Buys Rice From India దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత్ నుంచి బియ్యం(rice)దిగుమతి చేసుకుంటోంది చైనా. సరఫరాలు కట్టుదిట్టమవడం మరియు డిస్కౌంట్ ధరలకు భారత్ ఆఫర్ చేయడంతో భారత్ నుంచి బియ్యాన్ని చైనా దిగుమతి చేసుకోవడం ప్రారంభించిందని భారతీయ పారిశ్రామిక అధికారులు తెలిపారు.డిసెంబర్-ఫిబ్రవరి షిప్ మెంట్ కోసం ఒక టన్నుకి దాదాపు 300 డాలర్లు చెల్లించేలా 1లక్ష టన్నుల విరిగిన బియ్యాన్ని(broken rice) ఎగుమతి చేసేలా వ్యాపారులకు కాంట్రాక్ట్ ఇవ్వబడిందని పారిశ్రామిక ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, కొంతకాలంగా తూర్పు లఢఖ్ లో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్-చైనా మధ్య పొలిటికల్ టెన్షన్స్ నెలకొన్న సమయంలో భారత బియ్యాన్ని చైనా కొనుగోలు చేస్తుండటం గమనార్హం.కాగా, ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా భారత్ ఉండగా…అతిపెద్ద దిగుమతిదారుగా చైనా ఉంది. ఏటా దాదాపు 4 మిలియన్ టన్నుల రైస్ ని చైనా దిగుమతి చేసుకుంటది. అయితే, క్వాలిటీ బాగోలేదు అని వంకలు పెడుతూ భారత్ నుంచి మాత్రం బియ్యం దిగుమతి చేసుకునేది కాదు. థాయ్ లాండ్,వియత్నాం,మయన్మార్,పాకిస్తాన్ లు చైనా సాంప్రదాయక సరఫరాదారులుగా ఉన్నాయి. ఈ దేశాల వద్ద అదనపు రైస్ ఉండటంతో చైనాకి సరఫరా చేసేవి. అయితే భారత ధరలతో పోలిస్తే టన్నుకి 30డాలర్లు ఎక్కువే తీసుకునేవి ఈ దేశాలు.మొదటిసారి చైనా బియ్యం కొనుగోలు చేసింది. భారత పంట యొక్క క్వాలిటీ చూశాక వచ్చే ఏడాది మరింత ఎక్కువగా బియ్యాన్ని చైనా కొనుగోలు చేసే అవకాశం ఉందని రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీ.వీ. క్రిష్ణారావు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *