యుద్ధవాతావరణం అలాగే ఉంది..భారతీయ డాక్టర్ కు నివాళులర్పించిన చైనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

China : భారత్‌, చైనాల మధ్య పచ్చిగడ్డి వేస్తె భగ్గుమంటోంది. సరిహద్దు వివాదంతో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. సరిహద్దులో చైనా-భారత్ దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇటువంటి హాట్ హాట్ వాతావరణం మధ్యలో భారత్ కు చెందిన ఓ డాక్టర్ కు చైనా నివాళి అర్పించింది. ఆ డాక్టర్ పేరు ద్వారకానాథ్‌ కోట్నిస్‌.


1938లో చైనా, జపాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్ చైనా సైనికులకు వైద్య సేవలు అందించారు. దానికి గుర్తుగా చైనా ఇప్పటికీ గౌరవించుకుంటోంది.ఆయన సంస్మరణ దినాన్ని పాటిస్తోంది. అక్టోబర్ 10 ఆయన జన్మదినం సందర్భంగా డాక్టర్ ద్వారకా నాథ్ కోట్నీస్ కు చైనా నివాళులర్పించింది.


చైనా-జపాన్‌ యుద్ధం సమయంలో భారత్‌ నుంచి చైనాకు ఐదుగురు డాక్టర్లు వెళ్లారు. వారిలో నలుగురు డాక్టర్లు భారత్ తిరిగి వచ్చారు. కానీ, డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్ మాత్రమే అక్కడే ఉండి తన వైద్య సేవలను కొనసాగించారు. ఈ క్రమంలో డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్ 1942 డిసెంబర్ 9న చైనాలోనే ఆయన మరణించారు.


కానీ డాక్టర్ కోట్నీస్ అందించిన సేవల్ని మాత్రం చైనా మరచిపోలేదు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం చైనా ప్రభుత్వం ఆయన జయంతి (అక్టోబర్ 10)న సంస్మరణ సభ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది డాక్టర్‌ ద్వారకానాథ్‌ కోట్నిస్‌పై డాక్యుమెంటరీని కూడా ఆవిష్కరించారు.


అది 1938. స్వాతంత్ర్యం కోసం భారత్ అగ్నిజ్వాలలా మండిపోతోంది. అటు చైనా మావో జెడాంగ్ నాయకత్వంలో మ్యూనిస్టు విప్లవపోరాటం ప్రజ్వరిల్లుతోంది. భారత చైనాలు కల్లోలంగా ఉన్న సమయంలో చైనాపై జపాన్ సైన్యం విరుచుకుపడింది. చైనాపై జపాన్ దురాక్రమణకు పాల్పడింది. దీంతో చైనాలో ఎంతోమంది గాయాలపాలయ్యాయి. అప్పటికి చైనాలో ఆధునిక వైద్యం తెలిసిన డాక్టర్లు లేదు.దీంతో మాకు డాక్టర్ల సహాయం కావాలి డాక్టర్లను పంపించమని మావో ఇతర నాయకులు మిత్రదేశాల్ని కోరారు. ప్రపంచ ప్రసిద్దిగాంచి చైనా జనరల్ ఛూటే తమకు డాక్టర్లను పంపించాలని జవహర్ లాల్ నెహ్రూకి లేఖ రాశారు. అప్పడు నేతాజా సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. ‘‘మనం చైనాకు సహాయం చేద్దాం కదలిరిండి అని అని నేతాజీ 1938 జూన్ 30న ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిల భారత చైనా నిథి పేరుతో రూ.22వేలను..అంబులెన్స్ ను ఐదుగురు డాక్టర్ల బృందాన్ని పంపించారు. అప్పటికే చైనా యుద్ధరంగంలో డాక్టర్ నార్మన్ బెతూన్ తన సేవల్ని అందిస్తున్నారు.


ఆ డాక్టర్ల బృందంలో డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్ కూడా ఒకరు. అలా ఐదుగురు డాక్టర్ల బృందంలో అలహాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం. అటల్, నాగ్‌పూర్‌కు చెందిన ఎం. చోల్కర్, షోలాపూర్ నుండి డి. కోట్నిస్, బికె బసు, లకత్తాకు చెందిన దేబేష్ ముఖర్జీలతో సహా అలహాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం. అటల్, నాగ్‌పూర్‌కు చెందిన ఎం. చోల్కర్, బికె బసు, కలకత్తాకు చెందిన దేబేష్ ముఖర్జీలతో పాటు షోలాపూర్ నుండి కోట్నిస్ భారతీయులుగా చైనా పివ్లవానికి పుట్టినిల్లు అయిన యోనాన్ పర్వతలోయల్లోకి అడుగు పెట్టింది. అలా రోజుకు 72 గంటలు సైనికులు సేవలు చేస్తుండేవారు కోట్నీస్.


మావో ఛూటేల బృందం వీరికి ఘన స్వాగతం పలికారు. వారిని గుండెలకు హత్తుకున్నారు. అప్పటికే కోట్నీస్ వయస్సు 28ఏళ్లు. అంత చిన్నవయస్సులో భారతీయ డాక్టర్లు రాత్రింబవళ్లు అందించే సేవలకు చైనా సైనికులు చలించిపోయారు. ఉత్తర చైనాలోని వుతాయ్ పర్వత శ్రేణుల సరిహద్దులో పనిచేయటం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. గాయపడిన వేలాది సైనికుల్ని తీసుకొస్తునే ఉండేవారు.విశ్రాంతి అనే మాటే మరచిపోయి నిద్రాహారాలు మాని సేవలు చేసేవారు కోట్నీస్.


అలా కోట్నీస్ కు జింగ్లన్ అనే ఓ నర్స్ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ 1941లో పెళ్లి చేసుకున్నారు. 1942లో వారికి ఓ కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు వారు YINHUA అనే పేరు పెట్టుకున్నారు. కానీ అప్పటికే కోట్నీస్ ఆరోగ్యం దెబ్బతింది. యుద్దరంగంలో నిరంతరం సేవలతో విశ్రాంతి లే పని ఒత్తిడితో కొడుకు పుట్టిన మూడు నెలలకే కోట్నీస్ చనిపోయారు.కోట్నీస్ చనిపోవటానికి కొన్ని నెలల ముందే చైనా కమ్యూనిస్టు సభ్యత్వం తీసుకున్నారు. చనిపోయిన కోట్నీస్ ను NANQUAN గ్రామంలో ఖననంచేశారు. ఈ సందర్భంగా మావో మాట్లాడుతూ..కోట్నీస్ సేవలు స్ఫూర్తిదాయకమని మన హృదయాల్లో ఆయన ఎప్పటి నిలిచి ఉంటారని అన్నారు. మన భావి తరాలు కూడా కోట్నీస్ సేవల్ని గుర్తుపెట్టుకుంటాయని అన్నారు.


అలా చైనాలోని హేబీ రాష్ట్రం షిజియా జువాంగ్ నగరంలో కోట్నీస్ శిల్పాన్ని ప్రతిష్టించారు.ప్రతీ సంవత్సరం కోట్నీస్ సేవల్ని తలచుకుని నివాళులర్పిస్తుంటుంది చైనా. అప్పటి నుంచి కోట్నీస్ చైనా స్మరించుకుంటూనే ఉంది. ఆక్టోబర్ 10న కోట్నీస్ జన్మదినం సందర్భంగా చైనా కోట్నీస్ కు 110వ జన్మదినం సందర్భంగా నివాళులర్పించింది.


1910 అక్టోబర్ 10 న సోలాపూర్ నుండి మధ్యతరగతి మహారాష్ట్ర షొలాపూర్ లోని ఓ మధ్యతరగతి మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బొంబాయిలోని సేథ్ జిఎస్ మెడికల్ కాలేజీ లో పట్టభద్రుడయ్యాడు. అనంతంర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం సిద్ధమవుతున్న సమయంలో నేతాజీ పిలుపు మేరకు చైనాలో సేవలందించేందుకు కుటుంబ సభ్యుల అనుమతి కోరి చైనా సైనికులకు సేవలందించేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారు.వారి సేవలోనే తరించిపోయి అనారోగ్యానికి గురై 1942లో తన 32ఏట మరిణించారు.

Related Tags :

Related Posts :