లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

డ్రాగన్ దేశం మరో అద్భుతానికి శ్రీకారం: పట్టాలపై తేలియాడే రైలు..గంటకు 620 కిలోమీటర్ల వేగం..!!

Updated On - 11:28 am, Wed, 20 January 21

China Maglev train..speeds of 620 km per hour : ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశం చైనా. అలాగే టెక్నాలజీలో కూడా తమకు తామే సాటి అనిపించుకునేలే దూసుకుపోతోంది డ్రాగన్ దేశం చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నుంచి కృత్రిమ సూర్యుడిని సృష్టించేస్థాయికి చేరుకున్న చైనా..మరో అద్భుతానికి తెరతీసింది. ఎప్పటికప్పుడు విభిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాలు విసురుతోన్న చైనా తాజాగా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. అదే ‘‘పట్టాలపై తేలియాడే రైలు’ అంటే గాల్లో తేలే రైలు అనుకోవచ్చు. ఈ అద్భుతమైన ట్రైన్ గురించి చెప్పాలంటే విశేషాలకు కొదవేలేదు…గంటకు ఏకంగా 620 కిలోమీటర్లు వేగం ఈ ట్రైన్ సొంతం..! పైగా దీనికి చక్రాలు కూడా ఉండవ్..!! ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అనిపిస్తుంది.

సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అత్యద్భుతమైన ఈ కొత్త రైలును రూపొందించారు. మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత సాయంతో శాస్త్రవేత్తలు ఈ రైలును డిజైన్ చేసి ఔరా అనిపించారు. ఈ ట్రైన కు చక్రాలు ఉండవ్. కేవలం ఆయస్కాంత శక్తి సాయంతో పట్టాలపై తేలుతూ దూసుకుపోతుంది. చూసే వారికి మాత్రం గాల్లో తేలి దూసుకుపోతోందా? అనిపిస్తుంది. గంటకు 620 కిమీల వేగాన్ని రీచ్ అవ్వగలదంటున్నారు నిర్వాహకులు. ఈ ట్రైన్ లోపలి సీట్లు ఫైవ్ స్టార్ హోటల్ ని తలపించేలా ఉండి కళ్లు తిప్పుకోనివ్వని రిచ్ లుక్ తో అద్దరగొడుతున్నాయి. సీట్ల మధ్య ఓ టేబుల్ ఉంటుంది. అలాగే బోగీలో ఓ పేద్ద ఎల్ ఈడీ టీవీ ఉంటుంది.

చైనా ఆవిష్కరించిన ఈ కొత్త ట్రైన్ వాస్తవానికి ఓ ప్రోటోటైప్(నమూనా నిర్మాణం)! అంటే.. రైలు డిజైన్‌లో లోటుపాట్లను పరీక్షంచేందుకు, పనితీరును పరిశీలించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి వాటిని మాగ్లెవ్ రైళ్లు అంటారు. టెక్నాలజీకి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లో దశాబ్దాల క్రితమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. జపాన్ లో ఈ రైళ్లు గంటకు దాపు 320 కిమీల వేగంతో ప్రయాణిస్తుంటాయి.

ఈక్రమంలో అత్యాధునిక టెక్నాలజీలో తమకంటూ ఓ ముద్ర వేసుకుంటున్న డ్రాగన్ దేశం దూకుడుగా ముందుకెళుతోంది. దీంట్లో భాగంగానే కృత్రిమ సూర్యుడ్ని రూపొందించటం..ఇప్పుడు తాజాగా మాగ్లెవ్ రైళ్లు అభివృద్ధిపైన కూడా దృష్టి పెట్టింది. టెక్నాలజీ అంటే జాపాన్ అనే అంటాం. ఇప్పుడు చైనా కూడా జపాన్ తో పోటీ పడుతూ వివిధ ఆవిష్కరణలు చేస్తోంది. ఒక్కో అడుగు ముందుకేస్తోంది.

దీంట్లో భాగంగానే గంటకు 620 కిమీల వేగంతో వెళ్లే మ్యాగ్లెవ్ రైలు చైనాలో ఆవిష్కృతమైంది. హైటెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ(హెచ్‌టీఎస్)లో పూరోగతి సాధించడం ద్వారా దీన్ని రూపకల్పన చేశామని, ప్రస్తుతమున్న రైళ్లన్నింటికంటే ఈ ట్రైన్ స్పీడ్ గా దూసుకుపోతుందని చైనా సైంటిస్టులు తెలిపారు.

చైనా శాస్త్రవేత్తలు జనవరి 13న దేశప్రజల కోలాహలం మధ్య దీన్ని ఆవిష్కరించారు. కానీ.. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే దాదాపు 10ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలోని వివిధ నగరాలను వేగవంతమైన ప్రయాణసాధనాల ద్వారా అనుసంధానం చేయాలనేది చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగానే డ్రాగన్ దేశం మ్యాగ్లెవ్ రైళ్లను అభివృధ్ధికి శ్రీకారం చుట్టింది.