లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

అది మా భూభాగమే : అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామం నిర్మాణాన్ని సమర్థించుకున్న చైనా

Published

on

China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాయి. గ‌తేడాది నవంబ‌ర-1,2020న శాటిలైట్ ఈ ఫొటోల‌ను తీసింది. చైనా నిర్మించిన గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు తెలియజేస్తున్నాయి. అయితే, అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామం నిర్మాణంపై తాజాగా స్పందించిన చైనా.. ఎప్పటిలాగే వితండవాదన చేస్తోంది. ఆ ప్రాంతం తమ భూభాగమని, ఇది సాధారణ విషయమని వాదిస్తోంది. అంతేకాదు, పూర్తిగా తమ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…తూర్పు సెక్టార్‌లోని చైనా- భారత్ సరిహద్దు లేదా జాంగ్నాన్ ప్రాంతం (చైనా టిబెట్ దక్షిణ భాగం)లో చైనా వైఖరి స్థిరంగా,స్పష్టంగా ఉంది. చైనా భూభాగంలో అక్రమంగా స్థాపించిన అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు అని వ్యాణ్యానించారు.‘తమ భూభాగంలో సాధారణ నిర్మాణం పూర్తిగా తమ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం అని వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌లోని అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌ గా చైనా పరిగణిస్తోంది.

కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సుబాన్‌సిరి జిల్లాలో తారి చు న‌ది ఒడ్డున తాజాగా చైనా నిర్మించిన గ్రామం ఉన్న ప్రాంతం భౌగోళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ.. 1959 నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇంతకు ముందు అక్కడ చైనా ఆర్మీ పోస్టు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అక్కడ ఏకంగా ఓ గ్రామమే వెలిసింది. చాలా కాలంగా ఈ ప్రాంతం చాలా కాలంగా రెండు దేశాల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మ‌వుతోన్న విషయం తెలిసిందే. అటువంటి చోట చైనా ఏడాది వ్యవధిలో ఓ ఊరినే నిర్మించింది. అయితే, ఇదే ప్రాంతంలో ఆగ‌స్ట్ 26-2019న తీసిన మ‌రో ఫొటోలో ఎలాంటి నిర్మాణాలు క‌నిపించ‌డం లేదు. అంటే ఏడాదిలోపే చైనా ఇక్కడ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు అర్థమవుతోంది.

ఇదిలా ఉండగా, సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, దేశ భద్రత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత విషయంలో భారత్ రాజీపడబోదని కేంద్రం స్పష్టం చేసింది. సరిహద్దుల్లో పౌరుల జీవనోపాధిని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా రహదారులు, వంతెనలు సహా మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.