ఎట్టకేలకు…బైడెన్ కి శుభాకాంక్షలు చెప్పిన చైనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

China finally congratulates Joe Biden, Kamala Harri ఈ నెల 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు బైడెన్‌ కు శుభాకాంక్షలు తెలియజేయలేదు. కాగా,అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయం ఖరారైన వారం రోజుల తర్వాత ఇప్పుడు చైనా స్పందించింది.జో బైడెన్‌ కు శుక్రవారం అభినందనలు తెలిపింది చైనా. అమెరికా ప్రజల ఎంపికను గౌరవిస్తున్నాం.. జో బైడెన్, కమలా హ్యారిస్‌కు శుభాభినందనలు తెలియజేస్తున్నాం అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. కాగా, గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్ధి విజయం సాధించినా..,రష్యా,మెక్సికోలతో సహా కొన్ని ప్రధాన దేశాలు అభినందనలు తెలిపేవి కాదు. వాటిలో చైనా ఉంది. కానీ ఇప్పుడు బైడెన్ గెలిచినందుకు మిగిలిన దేశాలకంటే చైనా ముందుగానే విష్ చేయడం ఆసక్తికరంగా మారిందికాగా,నాలుగు దశాబ్ధాలుగా అమెరికా-చైనా మధ్య మెరుగ్గా సత్సంబంధాలు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఎన్నడూలేని క్షీణించాయి. నాలుగు దశాబ్ధాలుగా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ట్రంప్ తీరుతో బెడిసి కొట్టాయి. ముఖ్యంగా కరోనా విషయంలో చైనాపై ట్రంప్ చేసిన విమర్శలు డ్రాగన్ కంట్రీకి మన:శాంతిని లేకుండా చేశాయి.ఇక, బైడెన్ విజయాన్ని ట్రంప్ అంగీకరించకపోయినా.. ఆయనను కొత్త అధ్యక్షుడిగా అమెరికా మీడియా పేర్కొంది. ట్రంప్ కంటే బైడెన్‌కు 5 మిలియన్లకుపైగా పాపులర్ ఓట్ల వచ్చాయి. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2.7 మిలియన్ల ఓట్లను తొలగించారని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ ను రీట్వీట్ చేశారు. ట్రంప్ ఆరోపణలను అమెరికా ఎన్నికల వ్యవస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు.

Related Tags :

Related Posts :