Home » జాక్‌మాకు చైనా షాక్.. Ant Group ఐపీఓ షేర్లకు బ్రేక్!
Published
3 months agoon
By
sreehariAnt Group’s listing : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు ఎదురుదెబ్బ తగిలింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో యాంట్ గ్రూప్ షేర్లపై చైనా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు షాంఘై, హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. షాంఘై హాంకాంగ్‌లో యాంట్ గ్రూప్ కో 37 బిలియన్ డాలర్ల వాటా అమ్మకాలపై చైనా బ్రేక్ వేసింది.
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించింది. హాంగ్ కాంగ్ షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో జాక్ మా ఫిన్ టెక్ జాగర్‌నట్ భవితవ్యం ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
యాంట్ ఐపీఎంను స్టాక్ మార్కెట్లో లిస్టు కాకుండా సస్పెండ్ చేయడంతో హాంగ్ కాంగ్ ఎక్స్ఛేంజ్ షేర్లు పతనమయ్యాయి. ఇది హాంగ్ కాంగ్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌కు తీరని దెబ్బగా చెప్పవచ్చు.
హాంకాంగ్ లెగ్ కూడా సస్పెండ్ చేయనున్నట్టు షాంఘై ప్రకటించింది. యాంట్ కంపెనీలో మూడోవంతు వాటాను కలిగిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, ప్రీమార్కెట్ యుఎస్ ట్రేడింగ్‌లో 8 శాతానికి పడిపోయింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచికపై ఫ్యూచర్స్ 1.2 శాతం కోల్పోయింది.
ఈ ఐపిఓ ద్వారా యాంట్ గ్రూప్ 35 బిలియన్ డాలర్లు సేకరించాలని కోరింది. అలీబాబా గ్రూప్‌లో యాంట్‌లో 33 శాతం వాటా ఉంది. ఐపీఓ వాయిదా పడినప్పటి నుంచి అలీబాబా షేర్లు ఏడు శాతం పడిపోయాయి. ఈ ఉత్పత్తులలో చైనా అలిపే డిజిటల్ వాలెట్ కూడా ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద మనీ మార్కెట్ ఫండ్లలో ఒకటి. యాంట్ గ్రూప్ మొత్తం విలువ కనీసం 150 బిలియన్ డాలర్లు. ఫైనాన్షియల్ ఇన్నోవేషన్స్, రిస్క్ కంట్రోల్, ప్రైవేట్ డేటా రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంలో యాంట్ గ్రూప్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ అడిగాయి.
దీనిపై కంపెనీ నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో ఏకకాలంలో షాంఘై, హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి.