లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

జూలై 22 నుంచే పెద్ద ఎత్తున తమ దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న చైనా, వారికి అధిక ప్రాధాన్యత

Published

on

యావత్ ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారిని అంతం చేసే కరోనా వ్యాక్సిన్ ను కనుగొనే పనిలో ఉంది. సైంటిస్టులు, వైద్య నిపుణులు రాత్రి, పగలు ప్రయోగశాలలో శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు కీలకమైన హ్యుమన్ ట్రయల్స్ దశలను పూర్తి చేశాయి. కొన్ని నెలల్లో టీకాను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కాగా, ఏ దేశంలో అయితే కరోనా వైరస్ పుట్టిందో అదే దేశంలో ఇప్పటికే టీకా కూడా అందుబాటులోకి వచ్చిందనే నిజం తాజగా వెలుగులోకి వచ్చింది. చైనాలో ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ వినియోగం జరుగుతున్నట్లు తేలింది.వ్యాక్సిన్ ఇస్తున్నది వీరికే:
చైనాలో 2020 జూలై 22 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారని తెలిసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన కొవిడ్ 19 వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో స్థానికులు ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది, ఆర్మ్డ్ దళాలు, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషిటియేవ్ ప్రాజెక్టుల కోసం పని చేస్తున్న కంపెనీలు ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని చైనా హెల్త్ అధికారి ఒకరు శనివారం(ఆగస్టు 22,2020) తెలిపారు.అత్యవసరం వాడకం కింద వ్యాక్సినేషన్:
ప్రస్తుతం చైనా 8 రకాల కొవిడ్ వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తోంది. అవన్నీ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇంతవరకు అందులో ఒక్కటి కూడా మార్కెట్ లోకి వదిలేందుకు ఆమోదించలేదు. అయితే అత్యవసరం వాడకం కింద కొన్ని వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తున్నట్టు నేషనల్ హెల్త్ కమిషన్ మెడికల్ టెక్నాలజీ డైరెక్టర్ జెంగ్ జాంగ్ చెప్పారు. దీని ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ నడుస్తోంది.రెండు డోసులు:
వైద్య సిబ్బంది, ఆర్డ్మ్ దళాలు, ప్రాజెక్టుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికార వర్గాలు అనుమతి ఇచ్చాయి. రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఫస్ట్ డోసు ఇచ్చిన నెల రోజుల తర్వాత రెండో డోసు టీకా ఇస్తున్నారు. ఇప్పటివరకు వేలాది మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. చైనా మిలటరీ పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్లు ఇస్తోంది. దీంతో ఇప్పటివరకు ఎంతమందికి టీకా ఇచ్చారు అనే లెక్కలు చెప్పడం కష్టం అని అధికారులు తెలిపారు. ఈ శీతాకాలం సమయానికి వ్యాక్సిన్ ఇచ్చే వారి సంఖ్య డబుల్ కానుంది. శీతాకాలంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యో అవకాశం ఉన్నందున, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆహార మార్కెట్లు, రవాణ, సేవా రంగాల్లో పని చేసే వారికి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుతామన్నారు.రెండు షాట్ల వ్యాక్సిన్ ధర రూ.10వేల 800:
వ్యాక్సిన్లు మార్కెట్ లోకి వచ్చే నాటికి వాటి ధర అంచనా వేసిన దానికన్నా ధర ఎక్కువగా ఉండొచ్చని జెంగ్ చెప్పారు. ప్రస్తుతం చైనాకి చెందిన సైనో ఫార్మ్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. త్వరలో మార్కెట్ లోకి తేనుంది. దాని టీకా రెండు షాట్ల ధర రూ.10వేల 800గా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సిన్ మార్కెట్ లోకి తెస్తామని సైనో ఫార్మ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలకమైన మూడో దశ హ్యుమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. యూఏఈలో 20వేల మందిపై ట్రయల్స్ నిర్వహణకు సిద్ధమవుతోంది. అలాగే పెరూ, మోరాకో, అర్జెంటీనా దేశాలతో ట్రయల్స్ నిర్వహించేందుకు సైనో ఫార్మ్ ఒప్పందం చేసుకుంది.దేశ సరిహద్దుల్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల్లో పని చేస్తున్న కంపెనీ ఉద్యోగులు అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఓ ఉద్యోగి ఆగస్టు 7న వ్యాక్సిన్ తీసుకున్నాడు. జూలై 30 నుంచి ఇప్పటివరకు దాదాపు 10శాతం ఉద్యోగులకు గ్రూపులుగా వ్యాక్సిన్లు ఇచ్చినట్టు అతడు తెలిపారు. వీరంతా ఓవర్ సీస్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారే అని వెల్లడించాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *