భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా కొత్త కుట్ర, మెడిసిన్స్ ముడిసరుకు ధరలు భారీగా పెంచాలని నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆత్మ నిర్భర్ భారత్‌తో చైనా వణికిపోతుంది. భారత్‌ను దెబ్బతీసేందుకు కుట్రల మీద కుట్రలు రచిస్తోంది. తాజాగా భారత్‌కు ఎగుమతి చేసే మెడిసిన్స్‌కి సంబంధించిన ముడిసరుకులపై భారీగా ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 10 నుంచి 20శాతం ధరలు పెంచాలని భావిస్తోంది. స్వదేశీ కంపెనీలకు ప్రోత్సాహం పేరుతో దండిగా ధరలు పెంచాలని చూస్తోంది. పెంచేసే ధరల్ని రెండు మూడు నెలల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. చైనా మెడిసిన్స్‌పై ధరలు పెంచితే భారత ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది.

అసలే కరోనా కల్లోలం.. చాలా దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో చైనా దుర్మార్గపు చర్యలకు దిగుతోంది. అదను చూసి మెడిసిన్ ధరల్ని పెంచాలని స్కెచ్‌లు గీస్తోంది. కీ స్టార్టింగ్ మెటీరియల్స్‌, యాక్టివ్ ఫార్మాసూటికల్స్‌ ముడిసరుకులకు సంబంధించిన వాటిపై ధరలు పెంచాలన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. ఇండియాలో యాంటీబయోటిక్‌, స్టెరాయిడ్స్‌తో పాటు ఇతర మెడిసిన్ తయారీకి ఇవి ఉపయోగిస్తున్నారు. సెపలోస్పోరిన్స్‌, అజింతోమైసిన్, పెన్సిలిన్‌ లాంటి మెడిసిన్స్‌పై కూడా ధరలు పెంచాలని చూస్తోంది చైనా.

ప్రధానంగా కీ డ్రగ్ ముడిసరుకుల ధరలు పెంచాలని చైనా చూస్తోంది. మెడిసిన్ తయారీలో ఇవి కీలక పదార్థాలు. ఇండియాకు దిగుమతి అయ్యే కేఎస్‌ఎంపై ధరలు పెంచితే ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. నిజానికి మెడిసిన్ తయారీలో 70శాతం రా మెటీరియల్స్‌ చైనా నుంచే భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అలాగే పెన్సిలిన్ లాంటి లైఫ్‌ సేవింగ్ యాంటి బయోటిక్స్‌ 90శాతం ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వీటన్నింటిపై 20శాతం మేర ధరలు పెంచాలనుకుంటోంది జిత్తుల మారి చైనా.

చైనాలో లోకల్ మెడిసిన్ ప్రోడక్ట్‌ని ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా అక్కడి ఫార్మా సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే ఎగుమతులపై భారీగా సుంకాలు విధించాలని చైనా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది పైకి చెబుతున్నా.. అసలు కారణం మాత్రం భారత్‌ను దెబ్బతీసే కుట్రలో భాగమేనని స్పష్టమవుతుంది. చైనా మెడిసిన్స్‌ ఎగుమతులపై ధరలు పెంచితే మన ఫార్మా రంగానికి పెద్ద దెబ్బే. అయితే ఆత్మనిర్భర్‌లో భాగంగా ఇకపై స్వదేశంలో మెడిసిన్స్‌ తయారీ ఊపందుకునే అవకాశాలు లేకపోలేదు. ఇది ఒక రకంగా మంచిదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Related Posts