చైనా కుట్ర : 5 ప్రధానులు, 25 మంది సిఎంలు, 350 ఎంపీలపై చైనా నిఘా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

China is watching : Overseas Key Information Database (OKIDB). చైనా చేతిలో చిక్కిన విదేశీ ప్రభుత్వాల సమచార డేటాబేస్ ఇది. China ప్రభుత్వానికి సంబంధమున్న Zhenhua ఈ డేటా బేస్ ను సేకరించి చైనా చేతిలో పెట్టింది. china Communist Partyతోపాటు ప్రముఖుల అందిరి మీద నిఘా నేత్రమేసింది చైనా.

ప్రముఖుల సమాచారం చేతిలో ఉంటే వాళ్లను ఎలా కంట్రోల్ చేయొచ్చో చైనాకు బాగా తెలుసు. అందుకే ఈ టెక్నిక్‌తో విదేశాల మీద నిఘా వేసింది. ఇది డిజిటల్ ఐ. అంటే మనుషులుండరు. ఆన్‌లైన్‌లోకి చొరబడి కావాల్సిన సమాచారాన్ని దొంగిలిస్తారు.

మంత్రులు, మేయర్ల నుంచి ఎంపీల వరకు ప్రతి ఒక్కరి మీద డ్రాగన్ నిఘావేసింది. అన్నిపార్టీల్లోని, విదేశాల్లోని ఎంపీల్లో 1350 మంది మీద కన్నేసింది. వాళ్ల డేటా మొత్తాన్ని సేకరించింది. అందులో భాగమే ఇండియా డేటాలోకి చైనా చొరబాటు.



భారత్ ప్రముఖుల రహస్యాలు తెలుసుకొని చైనా ఏం చేయబోతోంది? చైనా నిఘా సంస్థ ఎలా పనిచేస్తుంది.? ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడుతోంది? ఈ స్పై ఆపరేషన్ వెనకున్న అసలు స్కెచ్ ఏంటి? చైనా పన్నిన ఈ కుట్ర డేటా చౌర్యం కుట్రలో దాగున్న అసలు కోణమేంటి?

Zhenhua Data Information Technology Co. Limited టెక్నాలజీ కంపెనీ. ఇదే ఈ కంపెనీనే భారతదేశంలోని 10 వేల మంది ప్రముఖులపై గూఢచర్యం చేస్తోంది. వారి కదలికలను, వారి డిజిటల్ లైఫ్‌లను నిశితంగా గమనిస్తూ స్పై ఆపరేషన్ చేస్తోంది. ప్రముఖుల రియల్ టైమ్ డేటాను చైనా ప్రభుత్వానికి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అందజేస్తోంది.

ఈ Zhenhua టెక్నాలజీ కంపెనీ ఎలా పనిచేస్తుంది? ఇండియాలోని ఫేమస్ పర్సనాలిటీలకు సంబంధించి.. ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తోంది? ఇంతకీ ఈ డేటా చౌర్యం వెనకున్న టార్గెట్ ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్.



స్పై ఆపరేషన్‌లో భాగంగాZhenhua టెక్నాలజీ కంపెనీ.. ప్రభుత్వ, రాజకీయ, వ్యాపార, సాంకేతిక, మీడియా, పౌరసమాజం నుంచి వ్యక్తులను, సంస్థలను టార్గెట్ చేస్తుంది. చైనా నిఘా సంస్థలు, మిలటరీ, భద్రతా ఏజెన్సీలతో కలిసి Zhenhua మానిటరింగ్ చేస్తూ ఉంటుంది.

ఎలా నిఘా వేస్తారంటే:
టార్గెట్ చేసిన వ్యక్తులను వారి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫాలో అవుతూ ఉంటారు. అలా వారి గురించి ఓ ఇన్ఫర్మేషన్ లైబ్రరీనే తయారుచేస్తారు. ఇందులో న్యూస్ సోర్సెస్ మాత్రమే కాదు ఫోరమ్స్, పేటెంట్స్, బిడ్డింగ్ డాక్యుమెంట్స్ లాంటివన్నీ ఉంటాయి. ప్రముఖుల రిలేషనల్ డేటాబేస్ కూడా ఈ కంపెనీ నమోదు చేస్తుంది.



వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తికి సంబంధించిన పరిచయాలు, వాళ్లతో అతనికి ఉండే అనుబంధం, సబ్జెక్ట్ పర్సనాలిటీకి సంబంధించిన సంస్థల సమాచారం కూడా సేకరిస్తుంది. ఇలా అన్ని రకాలుగా డేటా సేకరించాక.. మొత్తంగా అనలైజ్ చేసుకొని అతనిపై ఓ అవగాహన వస్తారు. అందులో ఏమైనా లోటుపాట్లు తేలితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు.

టార్గెట్ చేసిన వ్యక్తిపై 24 గంటల పాటు నిఘా. అతని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరిస్తారు. గూఢచర్యం చేస్తున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబం, స్నేహితులు, బంధువులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. సోషల్ మీడియాలో వారు చేసే పోస్టుల కింద.. ఫ్రెండ్స్, ఫాలోవర్స్ చేసే కామెంట్స్‌ని కూడా గమనిస్తూ ఉంటారు.



ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగడంతో పాటు.. ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ ద్వారా.. టార్గెట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు.. ఏం చేస్తున్నాడన్న విషయాలపై నిఘా ఉంటుంది.

దేశీయ భద్రతా సంస్థలు.. ఇలాంటి సమాచారాన్ని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. నిరసన కార్యక్రమాలను ట్రాకింగ్ చేసేందుకు వాడతారు. కానీ విదేశీ గూఢచర్యం కంపెనీలు ఈ సమాచారాన్ని ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చు. దాని ద్వారా చాలా దుష్పరిమాణాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

అందుకేజెన్‌వా టెక్నాలజీ కంపెనీ హైబ్రీడ్ వార్ ఫేర్‌‌లో తన పాత్రను బాగా ప్రచారం చేసుకుంటోంది.



భారత ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించడం, సరిహద్దుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని.. చైనా ఈ డర్టీ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. భారత్‌లోని ఫేమస్ పర్సనాలిటీల కదలికలను, డిజిటల్ లైఫ్‌ని.. చైనా కంపెనీలు అనుసరిస్తున్నాయని.. అలాగే వారి కుటుంబీకులు, మద్దతుదారుల పనితీరుపై కూడా డ్రాగన్ కంపెనీ నిఘా పెట్టినట్లు సమాచారం.

భారత్‌లోని పది వేల మంది ప్రముఖుల రియల్ టైమ్ డేటాని కూడా చైనా కంపెనీలు సిద్ధం చేసుకున్నాయి. పూర్తి ఇన్వెస్టిగేషన్ కోసం.. జెన్‌వా సంస్థ, చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి.. ఇన్వర్మేషన్ డేటా స్థావరాన్ని సృష్టించి.. ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెబుతున్నారు.



ప్రపంచవ్యాప్తంగా విదేశీయులపై చైనా స్పై కంపెనీ Zhenhua నిఘా పెట్టిందని అందులో భాగంగా ఇండియాలో 10 వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలపై గూఢచర్యం చేస్తోందని తేలింది. షెంజెన్‌లోని Zhenhua టెక్నాలజీ కంపెనీ అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయ్ నుంచి కూడా డేటా సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇదంతా రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోందని తేలింది.

Related Posts