పరస్పర సహకారానికి చైనా, నేపాల్ ఒప్పందం.. భారత్‌ను ఇరుకునపెట్టేలా డ్రాగన్ వ్యూహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్ కు వ్యతిరేకంగా శత్రువులు ఒక్కటి అవుతున్నారా? భారత్ ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు పన్నుతోందా? నేపాల్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా స్కెచ్ వేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా, నేపాల్ దేశాలు మరో అడుగు ముందుకేశాయి. పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు వాగ్దానం చేశాయి. ప్రాంతీయ వ్యవహారాలపై సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

చైనా, నేపాల్ పలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(BRI)లో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రాస్ బోర్డర్ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు ప్లాన్ రూపొందించారు. చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ జాహో, నేపాల్ ఫారిన్ సెక్రటరీ శంకర్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నారు. పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉంటాము. చైనా స్థానానికి మద్దతిస్తాము. తైవాన్, టిబెట్, హాంకాంగ్ విషయంలో చైనా తీరుని సమర్థిస్తాం అని నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శి బైరాగి తెలిపారు. 65వ వార్షి డిప్లోమాటిక్ సంబంధాలను పురస్కరించుకుని నేపాల్, చైనా నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చైనా, నేపాల్ నిత్యం ఒకరికి ఒకరు సమానంగా భావించాయని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేపాల్ అధ్యక్షుడు బైద్య దేవి బండారితో అన్నారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు గత నెలలో సమావేశం అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తో చర్చలకు సంబంధించి మాట్లాడుకున్నారు.

చైనా, నేపాల్ చర్చలపై భారత్ స్పందించింది. భారత్ కు చెందిన నేపాల్ అంబాసిడర్ నీలాంబర్ ఆచార్య మాట్లాడుతూ, దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మా దృష్టంతా కరోనా మహమ్మారిపైనే ఉందన్నారు. పొరుగు దేశంగా వారి అంతర్గత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోలేము. చైనాతో సమస్యలు ఉన్నప్పటికి ఆ దేశానికి సహకరిస్తూనే ఉన్నామని ఆచార్య చెప్పారు.

భారత్ నేపాల్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. దీనికి కారణం నేపాల్ అనుసరిస్తున్న తీరే. వివాదాస్పద ప్రాంతం అయిన కాలాపానీని నేపాల్ తమ దేశంలో భాగంగా వర్ణిస్తూ మ్యాప్ రూపొందించడం చర్చకు దారితీసింది. అంతేకాదు చైనాతో స్నేహానికి ఉవ్విళ్లూరుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్ కు వ్యతిరేకంగా చైనాకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

నేపాల్ తో మీటింగ్ సందర్భంగా చైనా పలు కీలక ప్రతిపాదనలు చేసింది. బీఆర్ఐ కింద నాలుగు దేశాలు(చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్) సహకరించుకోవాలని చైనా కోరింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ టు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ తో ఎకనామిక్ కారిడార్ ను కొనసాగించాలని చైనా నిర్ణయించింది.

READ  తిక్క కుదిరింది : కరోనాపై ఫ్రాంక్ వీడియో.. యువకుడికి ఐదేళ్లు జైలు

Related Posts