China rejects Donald Trump’s demand to allow US team to Wuhan to probe coronavirus

వుహాన్‌లో కరోనా మూలంపై అమెరికా విచారణకు అనుమతిని తిరస్కరించిన చైనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనావైరస్ మూలాన్ని పరిశోధించడానికి వుహాన్‌లోకి ఒక అమెరికన్ బృందాన్ని అనుమతించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తీవ్రంగా తిరస్కరించింది. తాము కోవిడ్ -19 బాధితులమేనని, నేరస్థులకాదని చైనా స్పష్టం చేసింది. కరోనావైరస్ ప్లేగుగా అభివర్ణించిన ట్రంప్.. సెంట్రల్ చైనా హుబీ ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో గత ఏడాది డిసెంబర్‌లో కరోనా మహమ్మారితో  చైనా పట్ల తాను సంతోషంగా లేనని అన్నారు. “చాలా కాలం క్రితమే చైనీయులతో మాట్లాడాము. లోపలికి వెళ్లాలని అనుకుంటున్నాం. ఏమి జరుగుతుందో చూడాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని అనుమతించడం లేదు’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ప్రాణాంతక వైరస్ తప్పించుకుందా? లేదా అనే దానిపై అమెరికా విచారణ ప్రారంభించింది.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ‘వైరస్ మానవాళికి సాధారణ శత్రువు’ అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కనిపించవచ్చు. ఇతర దేశాల మాదిరిగానే చైనా కూడా ఈ వైరస్ బారినపడింది. నేరస్థుడికి బదులుగా చైనా బాధిత దేశమని మర్చిపోవద్దు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు. సకాలంలో వైరస్‌ సమాచారం ఇవ్వని చైనాపై చర్యలు తీసుకోవాలని అమెరికా నేతలు డిమాండ్‌ చేయడంపై గెంగ్‌…‘వూహాన్‌లో తొలిసారి వైరస్‌ను గుర్తించింది మొదలు ఇప్పటివరకూ చైనా అన్ని అంశాలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తోందన్నారు. వుహాన్ లో మరణాల సంఖ్యను 50శాతం ఇటీవల సవరించిన తరువాత ఆదివారం నాటికి చైనాలో మరణించిన వారి సంఖ్య 4,632గా ఉంది. 

అమెరికాలో కోవిడ్ -19 మరణాల సంఖ్య 41,000 దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్లు 764,000 కన్నా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రంప్, పలువురు యుఎస్ రాజకీయ నేతలు చైనాలోని వుహాన్ లో వైరస్‌కు సంబంధించి తగినంత వివరాలను ఇవ్వాలని, చైనాపై చర్య తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ప్రపంచంలో చాలా మరణాలకు చైనాపై నిందలు మోపాలని అమెరికా రాజకీయ నేతల వాదనలను జెంగ్ ధీటుగా తిప్పికొట్టారు. 

యుఎస్ 2009లో గుర్తించిన హెచ్ 1 N1 ఇన్ఫ్లుఎంజాతో పాటు HIV / ఎయిడ్స్, 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారిందని జెంగ్ విమర్శించారు. దీనిపై ఎవరైనా యుఎస్ జవాబుదారీతనం అడిగారా? అంటూ ఆయన సూటిగా గెంగ్‌ ప్రశ్నించారు. కరోనావైరస్‌పై అంతర్జాతీయ విచారణ కోసం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ చేసిన పిలుపును ఆయన తిరస్కరించారు. చైనాతో కలిసి ఉన్నట్లు అమెరికా ఆరోపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమేయం లేకుండా ప్రపంచ విచారణ జరగాలని మారిస్ పేన్ డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి అన్నారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, తిరస్కరించామని జెంగ్ అన్నారు.

READ  ఇరాన్‌ను ఈ సారి ఇంకా గట్టిగా కొడతాం: ట్రంప్

వైరస్ వుహాన్‌లో ఉద్భవించిందనే ఆరోపణల గురించి జెంగ్ మాట్లాడుతూ.. వైరస్ మూలం తీవ్రమైన శాస్త్రీయ సమస్య. దీనికి శాస్త్రవేత్తల నుండి ఒక అంచనా అవసరమన్నారు. కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులలో అవసరమైన కీలకమైన వైద్య సామగ్రిని చైనా నిల్వ చేస్తుందన్న ట్రంప్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో ఆరోపణలను కూడా జెంగ్ ఖండించారు. మార్చి 1 నుండి ఏప్రిల్ 17 వరకు చైనా 1.64 బిలియన్ మాస్క్‌లు, 29.19 మిలియన్ సర్జికల్ ప్రొటెక్టివ్ సూట్లు, 156 ఇన్వాసివ్ వెంటిలేటర్లు, 4254 నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్లను అందించినట్లు జెంగ్ చెప్పారు. యుఎస్‌లో కోవిడ్ -19 వ్యాప్తి కంట్రోల్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని జెంగ్ చెప్పారు. 

Related Posts