లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

డేట్ కు కూడా తీసుకెళ్లవచ్చు : 10రూపాయలకే…అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్

Published

on

China: Shopping Complex Allows Shoppers To Hire 'girlfriends' For Just Rs 10

గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఒంటరిగా షాపింగ్ కు వెళ్లాలంటే మీకు బోర్ కొడుతుందా? పక్కన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. 10 రూపాయలు చెల్లిస్తే చాలు..షాపింగ్ మాల్ లోనే మీకోసం గర్ల్ ఫ్రెండ్ లు రెడీగా ఉంటారు. మీకు నచ్చిన అమ్మాయిని గర్గ్ ఫ్రెండ్ గా సెలక్ట్ చేసుకుని వారితో కలిసి ఎంచక్కా షాపింగ్ చేయొచ్చు. డేటింగ్ కు కూడా వెళ్లచ్చండోయ్.

కస్టమర్లను ఆకర్షించడం కోసం, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో భాగంగా కొంతమంది వ్యాపారాలు విచిత్రమైన ఆఫర్లను ప్రకటిస్తుంటారు. చైనాలోని ఓ షాపింగ్ మాల్ కూడా ఇలాంటి విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. యువకుల కోసం గర్ల్ ఫ్రెండ్ లను అద్దెకు పంపుతోంది. గువాంగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని హ్యూవాన్ సిటీలోని ది విటాలిటీ సిటీ షాపింగ్ మాల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

షాపింగ్‌కు  ఒంటరిగా వచ్చే యువకులకు.. అమ్మాయిలను అద్దెకు ఇచ్చేందుకు వారి కోసం మాల్‌ ప్రత్యేక పోడియం‌లను నిర్దేశించారు. మాల్‌లోకి వెళ్లేముందు 20 నిమిషాలకు రూ. 10 అద్దె చెల్లించి పోడియం వద్దనున్న అమ్మాయిలను తోడుగా తీసుకెళ్లొచ్చు. సమయం దాటితే మాత్రం మనతో వచ్చిన యువతులు వెంటనే పోడియం వద్దకు వచ్చేస్తారు.

మనతో ఉన్న సమయంలో ఆ యువతులు షాపింగ్‌లో ఏవైనా అనుమానాలు వస్తే సాయం చేస్తారు. తోడుగా ఉండటం మాత్రమే కాకుండా షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం వంటి పనులు కూడా చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ లను లంచ్, డేట్‌కు తీసుకెళ్లే సౌకర్యాన్నికూడా మాల్ కల్పిస్తోంది. అందుకోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదంటూ నిబంధనలు కూడా ఉన్నాయి. అన్నీ బానే ఉన్నా షాపింగ్‌ మాల్‌ కండిషన్స్‌ మాత్రం కొందరు యువకుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *