లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

మహిళాధిక్య గ్రామాల్లో రోగాలు తక్కువ.. పురుషులు హ్యాపీ

Published

on

China-tibet border The Kingdom of Women : ‘‘ఆ.. ఆడపెత్తనం బోడి పెత్తనమని’’ఆడాళ్లు ఎక్కడుండాలో అక్కడుండాలి అని అంటుంటారు చాలామంది పురుషులు. కానీ ఆడపెత్తనం అని చులకనగా తీసిపడేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణగా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని గ్రామాల గురించి తెలుసుకుందాం.పురుషాధిక్యత కలిగిన ప్రాంతాల కంటే మహిళాధిక్యత కలిగిన ప్రాంతాల్లో రోగాలు తక్కువగా ఉన్నాయని..సుదీర్ఘకాలంగా కొనసాగే జబ్బులు చాలా చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. బీపీ, డయాబెటీస్, హృదయసంబంధ వ్యాధుల్లాంటివి ఆ ప్రాంతాల్లో లేవని తేలింది. మరి అటువంటి ప్రదేశాల్లో ఓ గ్రామం గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.ప్రపంచంలోని ఎన్నో దేశాలు. భిన్న జాతులు..విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు, ఆచారాలు. సంస్కృతులు సంప్రదాయాలు ఎలా ఉన్నా చాలా వరకూ పురుషాధిక్య సమాజాలే ఉన్నాయి. మహిళలు సమానత్వం కోసం ఈ కంప్యూటర్ యుగంలో కూడా పోరాడుతున్న పరిస్థితి ఉంది. టెక్నాలజీ అయితే పెంచుకుంటున్నాం గానీ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను మాత్రం సమానంగా చూడలేకపోతున్నాం.


ఇటువంటి సమయంలో సమయంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ మ్యాటిసన్ అనే పరిశోధకుడికి ఓ పేద్ద డౌట్ వచ్చింది. పురుషాధిక్య సమాజంలో సమానత్వం కోసం పోరాడుతున్న మహిళలు.. మహిళాధిక్య సమాజంలో ఎలా ఉంటారు? వారి వ్యవహారా శైలి ఎలా ఉంటుంది? వారి ఆలోచనావిధానం ఎలా ఉంటుంది? అనే పలు అంశాల గురించి తెలుసుకోవాలనుకున్నారాయన.అంతే ప్రశాంతమైన వాతావరణం కలిగిన జ్ఞానాలను నిలయమైన హిమాలయాలకు ప్రయాణం అయ్యాడు. అలా వెళ్లిన మ్యాటిసన్ ఏ గురూజీనో..సాధువుల్లో కలవలేదు.ఆ ప్రాంతాల్లో నివసించే ఓ ఓ తెగ గురించి తెలుసుకోవటానికి..వారి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి వెళ్లారు.చైనాకు చెందిన ‘‘మోసువో’’ (Mosuo) అనే ఓ తెగకు చెందిన కొన్ని గ్రామాలు టిబెట్ బోర్డర్‌కు సమీపంలో హిమాలయాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో కొన్ని పురుషాధిక్య సమాజాలు ఉన్నాయి. మరికొన్ని గ్రామాలు మాత్రం మహిళాధిక్య సమాజాలుగా హాయిగా..జీవిస్తున్నాయి. ఈ గ్రామాల్ని ‘Kingdom of Women’అంటారు.మహిళాధిక్యం ఉన్న గ్రామాల్లో ఆస్తులకు వారసులు ఆడవారే. కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ మహిళలే చూసుకుంటారు. అన్ని విషయాల్లోను వారే ఉంటారు. పిల్లలు, భూములు, ఆస్తి పాస్తులు, నిర్ణయాధికారాలు వంటి పలు కీలక విషయాలు స్త్రీలే చూసుకుంటారు. ఇక్కడి స్త్రీలకు నచ్చితే ఎంత మంది మగవారనైనా ప్రియులుగా ఉంచుకుంటారట.

 

‘‘మోసువో తెగ’’లో రెండు రకాల సమాజాలూ ఉండటంతో దీనిపైనే పరిశోధన చేయాలని మ్యాటిసన్ నిర్ణయించుకున్నారు. మోసో తెగలో ఉండే పురుషాధిక్య సమాజాలు..మహిళాధిక్య సమాజాలు రెండింటిమీద పరిశోధించారాయన. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. అలా ఆయన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.పురుషాధిక్య గ్రామాలతో పోల్చుకుంటే, మహిళాధిక్యం ఉన్న గ్రామాల్లో ఆడవారు చాలా ఆరోగ్యంగా..ఆనందంగా ఉన్నారట. ఈరోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాన బీపీ, డయాబెటీస్ వంటివి మహిళాధిక్యత గ్రామాల్లో ఆయనకు కనిపించలేదట. అలాగే హృదయ సంబంధ వ్యాధులు మహిళాధిక్యం ఉన్న గ్రామాల్లో ఆడవారికి చాలా తక్కువగా వస్తున్నాయట. అలాగే పురుషాధిక్య గ్రామాల్లో మాత్రం పరిస్థితి దీనికి ఫుల్ డిఫరెంట్ గా ఉంది. 

అదే సమయంలో మహిళాధిక్య గ్రామాల్లోని పురుషుల్లో ఎటువంటి సమస్యలూ కనిపించలేదట. మహిళాధిక్యత కలిగిన గ్రామాల్లో పురుషులు చాలా సంతోషంగా..ఎటువంటి టెన్షన్లు లేకుండా జీవిస్తున్నారని తేలింది. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. మరి ఇదంతా తెలిస్తే ‘‘ఆడ పెత్తనం బోడి పెత్తనం’అని అనగలరా..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *