లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద ఆనకట్ట కడుతున్న చైనా.. భారత్, బంగ్లాదేశ్‌లలో ఆందోళనలు

Published

on

ఇండో-చైనా సరిహద్దు వివాదం మధ్య, టిబెట్ నుంచి ఉద్భవించిన బ్రహ్మపుత్ర నది(Yarlung Tsangpo) దిగువ ప్రవాహంలో భారత సరిహద్దు సమీపంలో ఒక భారీ ఆనకట్టను త్వరలో నిర్మించనున్నట్లు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆనకట్ట ద్వారా ఈశాన్య రాష్ట్రాలు మరియు బంగ్లాదేశ్‌లో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. టిబెట్‌లో హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్ట‌ేందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను చైనా త‌న 14వ పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో వెల్లడించింది.డ్యామ్ నిర్మాణానికి చైనా కంపెనీకి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు కొన్ని క‌థ‌నాలు కూడా ఆ దేశ మీడియాలో వచ్చాయి. చైనా ప‌వ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ యాన్ జియాంగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. బ్ర‌హ్మాపుత్ర న‌దిని టిబెట్‌లో యార్లంగ్ జాంగ్బో న‌దిగా పిలుస్తారు. ఆ న‌దిపై హైడ్రోప‌వ‌ర్ డ్యామ్‌ను క‌ట్ట‌నున్న‌ట్లు యాన్ జియాంగ్ తెలిపారు. జ‌ల‌వ‌న‌రులు, స్వ‌దేశీ భ‌ద్ర‌త అంశాల‌ను కూడా ఆ డ్యామ్‌తో ప‌రిశీలించ‌నున్న‌ట్లు చైనాకు చెందిన గ్లోబ‌ల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది.


దక్షిణ ఆసియా ప్రక్కనే ఉన్న సరిహద్దులో, ముఖ్యంగా భారతదేశంలో చైనా నిరంతరం దూకుడు వైఖరిని అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే టిబెట్ నుంచి ఉద్భవించిన బ్రహ్మపుత్ర నది లేదా యార్లుంగ్ జాంగ్బో నది దిగువ ప్రవాహంలో భారత సరిహద్దుకు దగ్గరగా ఒక పెద్ద ఆనకట్టను త్వరలో నిర్మించబోతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ ఆనకట్ట ఎంత పెద్దదిగా ఉంటుందంటే? చైనాలో నిర్మించిన ప్రపంచంలోని త్రీ జార్జ్ ఆనకట్ట కంటే మూడు రెట్లు ఎక్కువ జలశక్తిని ఇది ఉత్పత్తి చేయగలదు. ఈ పెద్ద సైజు ఆనకట్ట భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో కరువు సృష్టించగలదు.భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న టిబెట్‌లోని మీడోగ్ కౌంటీలో ఈ ఆనకట్టను నిర్మించవచ్చని గ్లోబల్ టైమ్స్ సూచించింది. చైనా ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై అనేక చిన్న ఆనకట్టలను నిర్మించింది. కొత్త ఆనకట్ట ఆకారంలో స్థూలంగా ఉండబోతున్నప్పటికీ. త్రీ జార్జ్ ఆనకట్టతో పోలిస్తే ఈ కొత్త ఆనకట్ట చాలా పెద్దదిగా ఉంటుంది. టిబెట్ అటానమస్ రీజియన్ నుండి ఉద్భవించిన బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ద్వారా దేశ సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత నది అస్సాంకు చేరుకుంటుంది. బ్రహ్మపుత్ర అస్సాం ద్వారా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.ఈ సంవత్సరం నుండి చైనా ఈ ఆనకట్టను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చే ఏడాది అమలు చేయబోయే 14వ పంచవర్ష ప్రణాళికలో ఇప్పటికే ఆమోదించబడింది. బ్రహ్మపుత్ర నది భారతదేశం మరియు బంగ్లాదేశ్ గుండా వెళుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆనకట్ట నిర్మాణ ప్రతిపాదనతో ఇరు దేశాల్లో ఆందోళనలు పెరిగాయి. అయితే, చైనా ఈ ఆందోళనలను తిరస్కరించింది. వారి ప్రయోజనాల కోసం మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది.


టైమింగ్ కన్నా ప్రాణం మిన్న..నాలుగు ప్రాణాలు కాపాడటానికి లేట్ గా బయల్దేరిన విమానం


అయితే భారత ప్రభుత్వం తన అభిప్రాయాలను మరియు ఆందోళనలను చైనా అధికారులకు క్రమం తప్పకుండా తెలియజేస్తూనే ఉంది. నది ఎగువ ప్రాంతాలలో కార్యకలాపాలు దిగువ భాగంలో పాల్గొన్న దేశాల ప్రయోజనాలకు హాని కలిగించకుండా చూడాలని చైనాను కోరుతుంది. అయితే 2035 నాటికి దేశ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనికి రూపకల్పన చేసినట్లుగా అక్కడి ప్రభుత్వం చెబుతుంది. చైనా హైడ్రో పవర్ పరిశ్రమలో ఈ ప్రాజెక్టు ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆ దేశ ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల భారత్, బంగ్లాదేశ్‌లకు ఎటువంటి ఇబ్బంది వాటిల్లదని ప్రభుత్వం చెబుతుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *