Home » భర్తని పందుల బోనులో బంధించి నదిలో పడేసిన భార్య
Published
2 months agoon
By
nagamaniChina wife tied up husband in a pig cage and throws him into river : ఓ భర్తను ఎంతగానో ప్రేమించే ఓ భార్య భర్తను పందుల బోనులో బంధించి నదిలోకి విసిరేసింది. భర్తను అంతగా ప్రేమించిన ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే అది సరైందే అంటారు. కానీ ఎంత అన్యాయంచేస్తే మాత్రం ఏకంగా ప్రాణం తీయటమేంటని ఇంకొందరు అంటారు. ఇంతకీ భర్తను అంత దారుణంగా పందుల బోనులో బంధించి నీటిలో పడేసిన ఘటన చైనాలోని మామింగ్ నగరంలో ఈ ఘటన శుక్రవారం (నవంబర్ 27,2020)న వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే చైనాలో ఓ నదిలో పందుల బోనులో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు రక్షించారు. అతన్ని ఆ బోనులో నుంచి బైటకు తీసి సపర్యలు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించారు. నిన్నెవరు ఇలా చేశారని ప్రశ్నించారు. దానికి అతను చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించగా..అతడి భార్యే కాళ్లు చేతులు కట్టేసి.. పందుల బోనులో పెట్టి నదిలోకి విసిరేసిందని తెలిపాడు. దీంతో పోలీసులు అతడి భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దానికి ఆమె నా భర్త అంటే నాకు చాలా ఇష్టం..చాలా బాగా చూసుకుంటాను. కానీ నాకు అతను ద్రోహం చేశాడు. వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేను ఇంటికొచ్చేసరికి ఇద్దరూ మా బెడ్ రూమ్ లో మంచంమీద వారిని అలా చూసేసరికి నాకు దు:ఖం వచ్చింది.
నిలదీస్తే నాఇష్టం అని సమాధానం చెప్పాడు.దానికి నా దు:ఖం కాస్తా కోపంగా మారింది.తప్పు చేసింది కాకుండా ఎంత పొగరుగా మాట్లాడుతున్న భర్తమీద అసహ్యం వేసింది.అందుకే దానికి శిక్షగా ఇలా పందుల బోనులో పెట్టి నదిలోకి వదిలేశానని చెప్పింది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్తను హాస్పిటల్కు తరలించారు.
కాగా ఆ భార్య భర్తకు విధించిన శిక్ష గురించి పోలీసులు తెలుసుకున్నారు. ఇదేదో విచిత్రంగా ఉందే. ఆమెకు ఈ ఆలోచన రావటానికి గల కారణం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చైనాలో చాలా ప్రాచీన కాలం నాటిదని పోలీసులకు తెలిసింది.
చైనాలో మింగ్ వంశస్థులు పాలన కాలంలో (క్రీస్తు శకం 1368-1644), క్వీంగ్ పాలన(క్రీ.శ.1644-1912) కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకొనే వ్యక్తులకు ఇలాంటి శిక్షే విధించేవారు. నిందితులను పందుల బోనులో బంధించి నదిలో వదిలేసేవారని, అదే శిక్షను ఆమె అమలు చేయడంపై అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ శిక్షను చైనాలో నిషేదించారు. ఈక్రమంలో ఆమె ప్రాచీన కాలంనాటి శిక్షను భర్తపై ఉపయోగించిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.