నంగనాచిలా ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్న చైనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత సరిహద్దులను కబ్జా చేసేందుకు ట్రై చేసి భంగపడ్డ చైనా.. ఇప్పుడు తప్పుడు ప్రచారం మొదలెట్టింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రెజర్‌ను తగ్గించుకునేందుకు.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చాలని చూస్తోంది చైనా. బోర్డర్ క్లాష్‌లో.. ఇండియాను విలన్‌గా.. తనను తాను విక్టిమ్‌గా చూపించే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ కంట్రీ.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోవడం.. దానిని ప్రపంచానికి అంటించడం, కొత్త భద్రత చట్టం అమలుతో.. హాంకాంగ్‌లో పౌరుల స్వేచ్ఛను హరించివేయడం, సొంతదేశంలోని ముస్లింలను, అణగారిన వర్గాలను.. ఉక్కుపాదంతో అణచివేయడం, పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు పెట్టుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చైనా చేయనిది ఏదీ లేదు. వీటన్నింటిపై.. అంతర్జాతీయ దేశాల నుంచి ప్రెజర్ పెరుగుతోంది. ప్రపంచం దేశాలన్నీ.. చైనాను విలన్‌గా చూస్తున్నాయ్. డ్రాగన్ గుట్టు విప్పేందుకు ప్రయత్నిస్తున్నాయ్.

వీటన్నింటిని కవర్ చేసేందుకు.. LAC విషయంలో.. దేశ ప్రజల ముందు తానే బాధిత దేశంగా నిలబడి.. నాటకాలాడుతోంది చైనా. గల్వాన్‌లో చైనా ప్రదర్శించిన దుందుడుకుతనాన్ని కప్పిపుచ్చేందుకు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్లే చేస్తున్న ఇదీ కొత్త స్ట్రాటజీ. LAC దగ్గర.. ఈ రెండు నెలల్లో ఏం జరిగిందో చెప్పడంతో పాటు చైనా బలగాలు ఎందుకు వెనక్కి తగ్గాయనే దానిపై.. తమకు అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేసుకుంటోంది చైనా ప్రభుత్వం. ఇందుకు.. అక్కడి మీడియాను బాగా వాడుకుంటోంది కమ్యూనిస్ట్ పార్టీ.

లైవ్‌లు, డిబేట్లు పెట్టి.. గల్వాన్‌లో చైనా ప్రదర్శించిన దుందుడుకుతనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. డిబేట్లలో పాల్గొన్న వారి సొంత కథలనే.. ప్రజలకు నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేశారు. భారత బలగాలే.. వాస్తవాధీన రేఖను దాటి ముందుకొచ్చాయని.. సరిహద్దు నియంత్రణను ఉల్లంఘించాయని చెప్పుకొచ్చారు. చైనా భూభాగంలోకి వచ్చిన ఇండియన్ ఆర్మీని.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అడ్డుకుందని.. తప్పుడు ప్రచారం చేశారు.

గల్వాన్ ఉద్రిక్తతల విషయంలో.. ప్రపంచం ముందు చైనా బాధిత దేశంగా నిలబడాలని చూస్తోంది. LAC టెన్షన్స్‌లో.. ఇండియాను విలన్‌గా చూపెట్టాలని గట్టిగా ట్రై చేస్తోంది. కానీ.. చైనా ఎలాంటిదో.. దాని కుటిల నీతి, రణనీతి, జిత్తులమారితనమేంటో.. గ్లోబ్ మొత్తం తెలుసు. అంతర్జాతీయంగా చైనాపై పడిన మరకను తుడిచేసుకునేందుకు.. ఇప్పుడు ఇండియాపై దుష్ప్రచారం చేస్తోంది. కానీ.. అది వర్కవుట్ అవడం లేదు. చైనా ఎంత చేసినా.. ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. కనీసం వినడం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే.. గల్వాన్ విషయంలో చైనా తనకు అనుకూలంగా ఏం చెప్పినా మిగతా దేశాలు పట్టించుకోవడం లేదు.

కరోనా విషయంలో.. చైనాను అగ్రదేశాలేవీ నమ్మడం లేదు. చైనా గోప్యత, వంచన, కప్పిపుచ్చుకునేతనం.. కరోనాతో ప్రపంచం మొత్తం వ్యాపించిందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. చైనా ఇప్పటికైనా.. ప్రపంచానికి జవాబుదారీగా ఉండాలని సూచించారు. హాంకాంగ్‌లో కొత్త భద్రతా చట్టాన్ని అమలు చేయడాన్ని.. కెనడా కూడా ఖండించింది. ఇక.. చైనాలో ముస్లిం వర్గాలను అణచివేయడంపై కూడా గ్లోబ్ వైడ్‌గా అన్ని దేశాలు ఖండించాయ్.

READ  పెళ్లికి గిఫ్ట్‌లు కాదు.. హనీమూన్‌కు డబ్బులివ్వండి

అన్ని వైపుల నుంచి.. అన్ని దేశాల నుంచి ప్రెజర్ పెరుగుతుండటంతో.. లద్దాఖ్ ఇష్యూలో తనను బాధిత దేశంగా చూపించుకునే ప్రయత్నం చేసింది డ్రాగన్ కంట్రీ. కానీ.. ఇండో-చైనా బోర్డర్ లోని.. వాస్తవాధీన రేఖ దగ్గర జరిగిన వాస్తవాలేంటో.. మిగతా దేశాలకు తెలుసు. గల్వాన్ విషయంలో.. చైనా ఎంత తప్పుడు ప్రచారం చేసినా.. నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు యుద్ధం వచ్చినా.. చైనా పొరుగు దేశాలు, భారత్ మిత్రదేశాలు, ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ.. ఇండియా వైపే నిలబడతాయ్.

చైనాకు బుద్ధి చెప్పేందుకు.. వాటికి చేతనైన సాయం చేస్తాయ్. ఇండియా-చైనా ఫేస్ ఆఫ్‌లో.. ఇప్పటికే అగ్రదేశాలన్నింటి నుంచి భారత్‌కు మద్దతు లభించింది. చైనా.. భారత్‌పై తప్పుడు ప్రచారానికి తెగబడుతోంది. చైనా ప్రజల ముందు.. తమనే బాధిత దేశంగా చూపించుకుంటోంది. వాళ్ల ప్రజలనే మోసం చేస్తోంది.

Related Posts