మరికొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పరీక్షలు, ఒప్పందం చేసుకున్న చైనా కంపెనీలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వ్యాక్సిన్ లేట్ స్టేజ్ క్లినికల్ టెస్టులు నిర్వహించేందుకు మరికొన్ని దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్ బీజీ), సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ తెలిపాయి. వాటిలో సెర్బియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఆ దేశాల్లో ఫేజ్ త్రీ ట్రయల్స్ నిర్వహిస్తారు. సీఎన్బీజీ వుహాన్, బీజింగ్ యూనిట్లలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ను సెర్బియాలో పరీక్షిస్తారు. బీజింగ్ లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తారు.

10 దేశాల్లో 50వేల మందిపై ఫేజ్ త్రీ ట్రయల్స్ నిర్వహించాలని సీఎన్ బీజీ నిర్ణయించింది. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్, పెరూ, మొరాకో, అర్జెంటీనా, జోర్డాన్ లో ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే 500 మిలియన్(50 కోట్లు) డోసుల వ్యాక్సిన్ సరఫరా కోరుతూ పలు దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయని చైనా కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం సీఎన్బీజీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. అది పూర్తయ్యాక ఏటా 300 మిలియన్(30 కోట్లు) డోసుల కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే ఏడాదికి 1 బిలియన్(100 కోట్లు) డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందిస్తోంది. నోవాక్స్ అభివృద్ధి చేసినా టీకా కరోనా వాక్స్.. బ్రెజిల్, ఇండోనేషియాలో టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు మరో రెండు దేశాలు ఫేజ్ త్రీ ట్రయల్స్ తమ దేశంలో నిర్వహించేందుకు ఓకే చెప్పాయి. అయితే ఆ రెండు దేశాలు ఏవి అనేది చెప్పలేదు. వాటి పేర్లను గోప్యంగానే ఉంచారు.

వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు. వ్యాక్సిన్ ఎంత వరకు ప్రభావంతమైనది, ఎంతవరకు సురక్షితం అనేది తెలియదు. సినోవాక్, సీఎన్ బీజీ అభివృద్ధి చేసిన కరోనా టీకా తుది దశ ట్రయల్స్ లో ఉండగానే, హై రిస్క్ గ్రూపుల వారి అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చేశారు. వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అత్యవసరం కింద ఇప్పటికే వేలాది మంది కరోనా వాక్ టీకా తీసుకున్నారని సినోవాక్ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే సీఎన్ బీజీ కూడా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేనుంది. విదేశీ కార్యాలయాలు, కాన్సులేట్లలో పని చేస్తున్న చైనా సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Related Posts